ఇండియన్ సినిమా మరో దిగ్గజ నటుడిని కోల్పోయింది. బాలీవుడ్ వెనుకటి తరం సూపర్ స్టార్ రిషి కపూర్ గురువారం కన్నుమూశారు. ఇప్పటి వాళ్లకు ఆయన రేంజ్ తెలియక పోవచ్చు కానీ.. 70, 80 దశకాల్లో సినిమాలు చూసిన వాళ్లు రిషి కపూర్ ఎంత పెద్ద స్టారో.. ఆయన సినిమాలు ఏ స్థాయిలో రంజింపజేశాయో కథలు కథలుగా చెబుతారు.
తాత పృథ్వీ రాజ్ కపూర్, తండ్రి రాజ్ కపూర్‌ల వారసత్వాన్ని కొనసాగిస్తూ తిరుగులేని ఇమేజ్ సంపాదించాడు రిషి. రొమాంటిక్ హీరోగా ఆయనకు గొప్ప పేరే ఉంది. తొలి సినిమా ‘బాబీ’తోనే పెద్ద స్టార్ అయిపోయాడు రిషి. ఆ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెద్ద విజయాన్నందుకుంది.
హైదరాబాద్, విజయవాడ లాంటి చోట్ల వంద రోజులాడింది. ఓ హిందీ సినిమా ఇక్కడ అలా ఆడటం అరుదైన విషయం. ఇక్కడే ఇన్ని రోజులు నడిచిందంటే.. ఉత్తరాదిన ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అంచనా వేయొచ్చు.
ఐతే ఇంత పెద్ద హిట్ సినిమా వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది. రిషిని హీరోగా పరిచయం చేయడం కోసం ప్లాన్ చేసి తీసిన సినిమా కాదిది. రిషి అంతకుముందే బాల నటుడిగా నటించిన ‘మేరా నామ్ జోకర్’ సినిమా ఫ్లాప్ అయింది. ఆ సినిమా కోసం చేసిన అప్పులు తీర్చడం కోసం రాజ్ కపూర్ ‘బాబీ’ తీసినట్లుగా ఓ ఇంటర్వ్యూలో రిషి వెల్లడించాడు.
‘‘నన్ను వెండితెరకు పరిచయం చేయడం కోసం నాన్న ‘బాబీ’ తీశారని చాలామంది అపోహ పడ్డారు. కానీ ‘మేరా నామ్ జోకర్’ తాలూకు అప్పులు తీర్చడం కోసం ఓ యువ కథ తెరకెక్కించాలని నాన్న భావించారు. నిజానికి ఈ సినిమా కోసం రాజేష్ ఖన్నాను హీరోగా తీసుకోవాలనుకున్నారు. కానీ ఆయనకు పారితోషకం ఇవ్వడానికి మా నాన్న దగ్గర డబ్బుల్లేక నన్ను ఎంచుకున్నారు. అలా నేను హీరోగా పరిచయం అయ్యాను’’ అని రిషి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాదు.. రిషికి ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది.
This post was last modified on May 1, 2020 2:55 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…