Movie News

అనిరుధ్ మళ్ళీ దెబ్బ కొట్టాడు

రాను రాను రాజగుర్రం ఏదో అయ్యిందని పాత సామెత ఒకటుంది. అనిరుధ్ రవిచందర్ ని చూస్తుంటే ఇదే గుర్తొస్తోంది. మొన్నటిదాకా వరస బ్లాక్ బస్టర్లతో ఊపేసిన ఈ మ్యూజిక్ సెన్సేషన్ గత కొంత కాలంగా తన స్థాయికి తగ్గ సంగీతం ఇవ్వలేకపొతున్నాడు. నిర్మాతలు భారీ పారితోషికాన్ని సమర్పించుకుంటూ ఒక్కోసారి డేట్లు దొరక్క విడుదల వాయిదా వేయాల్సి వచ్చినా అన్నింటిని తట్టుకుని మరీ పని చేయించుకుంటున్నారు. అయినా సరే ఫలితాలు రావడం లేదు. సినిమాలు బాగుండకపోవడం తర్వాత విషయం. ముందైతే కాస్త గుర్తుండిపోయే సాంగ్స్, బీజీఎమ్ ఇస్తే కనీసం ఆల్బమ్ అయినా నిలబడుతుంది కదా.

తాజాగా మదరాసి రూపంలో అనిరుధ్ ఖాతాలో మరో యావరేజ్ మూవీ తోడయ్యింది. తమిళ వెర్షన్ వరకు అలా అంటున్నారు కానీ మిగిలిన భాషల్లో మాత్రం ఫ్లాప్ దిశగానే పరుగులు పెడుతోంది. కంటెంట్ తేడాగా ఉన్నా విమర్శకులు ప్రస్తావిస్తున్న మైనసుల్లో అనిరుధ్ పనితనం కూడా ఉంది. బీజీఎమ్ పదే పదే విన్నట్టు అనిపించిందని, ఫ్రెష్ గా లేదనే కామెంట్స్ ఎక్కువ వచ్చాయి. పాటలు కూడా మరీ తీవ్రంగా వైరల్ కాలేదు. మౌనికా సాంగ్ మినహాయించి కూలికి చేసిన వర్క్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. దీని వెనుక కింగ్డమ్, విడాముయార్చి, వెట్టయన్ అన్నింటిది ఒకే కథ. దేవర ఒక్కటే మినహాయించాల్సి ఉంటుంది.

ఇలా అయితే అనిరుద్ తనను తాను రిస్కు లో పడేసుకున్నట్టే. ఇప్పటికీ చేతి నిండా సినిమాలున్నాయి ప్రదీప్ రంగనాదన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, రజనీకాంత్  జైలర్ 2, నాని ది ప్యారడైజ్, గౌతమ్ తిన్ననూరి మేజిక్, విజయ్ జన నాయకుడు, షారుఖ్ ఖాన్ కింగ్ ఇలా క్రేజీ ప్రాజెక్టులు క్యూ కట్టుకున్నాయి. ఇవన్నీ జస్ట్ ఏడాది కాలంలోనే రిలీజైపోతాయి. వీటిద్వారా మళ్ళీ తానేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అనిరుధ్ మీద ఉంది. ఊరికే హోరెత్తే నేపధ్య సంగీతం, పాటలు కాకుండా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మ్యూజిక్ ఇమ్మని సంగీత ప్రియులు కోరుతున్నారు. మరి అనిరుధ్ పాత కసితో పని చేస్తాడో లేదో చూడాలి.

This post was last modified on September 6, 2025 5:38 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Anirudh

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

2 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

4 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

4 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

4 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

6 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

7 hours ago