టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయిన బాహుబలి రీ రిలీజ్ సందర్భంగా కొన్ని విషయాలను ముంబై మీడియా అదే పనిగా తవ్వుతున్న వైనం ఆన్ లైన్ లో కనిపిస్తోంది. రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రకు ముందు శ్రీదేవిని అనుకుని, తర్వాత ఆమె డిమాండ్లను తట్టుకోలేక రాజమౌళి నిర్ణయం మార్చున్నారనే ప్రచారం కొన్నేళ్ల క్రితం బలంగా తిరిగింది. జక్కన్న చెప్పింది ఒకటైతే దానికి అర్థం ఇంకోలా వెళ్లిపోవడం వేరే విషయం. తర్వాత జరిగిన చరిత్ర తెలిసిందే. శ్రీదేవి కాలం చేశారు. బాహుబలి రికార్డులు బద్దలు కొట్టింది. తాజాగా నిర్మాత బోనీ కపూర్ అప్పట్లో జరిగిన వివాదాన్ని మరోసారి తవ్వారు.
శ్రీదేవి గొంతెమ్మ కోరికలు అడిగిందనే ప్రచారం నిజం కాదని, ఇంగ్లీష్ వింగ్లిష్ కన్నా తక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం వల్లే వద్దనుకున్నామని, పిల్లలకు సెలవులు ఉన్నప్పుడే షూటింగ్ పెట్టుకుంటే అనుకూలంగా ఉంటుందని చెప్పామని, అంతే తప్ప హోటల్ లో ఫ్లోర్ మొత్తం డిమాండ్ చేయలేదని వివరణ ఇచ్చారు. నిజానికి ఇప్పుడీ టాపిక్ అసందర్భం. ఇది నిజమో కాదో చెప్పేందుకు శ్రీదేవి లేరు. రాజమౌళి ఈ ప్రస్తావన తీసుకురారు. శ్రీదేవి మీద అపారమైన గౌరవం ఉన్న నేపథ్యంలో అనవసరంగా హైలైట్ అయ్యేలా ఎంత మాత్రం రచ్చ చేసుకోరు. కాబట్టి బాహుబలి ఎపిక్ ప్రమోషన్లలో ఈ టాపిక్ ఉండదు.
అలాంటప్పుడు బోనీ కపూర్ అదే పనిగా ఫ్లాష్ బ్యాకులు పంచుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. శ్రీదేవి కమిట్మెంట్ అందరికీ తెలిసిందే. రాజమౌళి సిన్సియారిటీని ఎవరూ శంకించరు. అలాంటప్పుడు అప్పుడిలా జరిగింది అలా జరిగిందంటూ గుర్తు చేస్తూ పోతే అది సోషల్ మీడియాకు స్టఫ్ గా మారడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. అక్టోబర్ 31 రీ రిలీజ్ కాబోతున్న బాహుబలి ఎపిక్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కన్పిస్తోంది. కెన్యా నుంచి రాజమౌళి టీమ్ తిరిగి వచ్చాక ప్రమోషన్లు చేపట్టబోతున్నారు. వరల్డ్ వైడ్ పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
This post was last modified on September 6, 2025 5:34 pm
ఒకప్పుడు ఆస్కార్ అవార్డుల గురించి ఇండియన్ ఫిలిం మేకర్స్ ఆలోచించడం కూడా కష్టంగా ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత…
మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…
కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని అనుకునేవారు.. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల…
విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆవేశపూరిత ప్రసంగాలు చేసిన సంగతి…