మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్, సెన్సాఫ్ హ్యూమర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెర మీద కామెడీని అద్భుతంగా పండిస్తారాయన. ‘అన్నయ్య’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సహా ఎన్నో సినిమాలు ఇందుకు ఉదాహరణ. ఆయన బయట కూడా అంతే సరదాగా ఉంటారు. సినిమా వేడుకల్లో, ప్రెస్ మీట్లలో తనదైన శైలిలో పంచులు వేస్తుంటారు. హావభావాలతో నవ్విస్తుంటారు. ఇక సినిమాల మేకింగ్ టైంలోనూ ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో చిరు చాలా సరదాగా ఉంటారని.. ఆయనతో పని చేసిన వాళ్లు ఉదాహరణలు చెబుతుంటారు. తాజాగా అలాంటి ఉదంతం ఒకటి నటుడు, రచయిత, దర్శకుడు హర్షవర్ధన్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
హర్ష ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు హీరోగా తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్’ చిత్రంలో నటిస్తున్నారు. ఆ షూటింగ్ గ్యాప్‌లో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గురించి ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘మన శంకర వరప్రసాద్’ షూటింగ్ టైంలో హర్ష, చిరు కలిసి ప్రయాణం చేస్తుండగా.. చిరు చాలా ఆత్మీయంగా మాట్లాడుతూ.. ‘‘హర్ష.. నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలయ్యా’’ అన్నాడట. దాంతో తాను చాలా ఎమోషనల్ అయ్యానని హర్ష వెల్లడించాడు. ఈ మాట అనగానే యాంకర్ చప్పట్లు కొట్టారు.
తర్వాత హర్ష కొనసాగిస్తూ.. ‘‘నువ్వు నా పక్కన ఉంటేనే కదా.. నేనెంత సన్నగా, ఫిట్‌గా ఉన్నానో తెలిసేది’’ అంటూ పంచ్ వేసినట్లు తెలిపారు. దీంతో అవాక్కవడం యాంకర్ వంతైంది. చిరు అంతటితో ఆగకుండా.. ‘‘నువ్వు నా పక్కన లేకుంటే నేను బతకలేను మరి. నువ్వే నాకు దిక్కు. నాకు ఎవరూ లేరు’’ అంటూ తనను ఆటపట్టించినట్లు హర్ష వెల్లడించారు. చిరు ఆర్టిస్టులతో ఎంత సరదాగా ఉంటారు.. ఆయన సెన్సాఫ్ హ్యూమర్ ఎలాంటిది చెప్పడానికి ఇది ఉదాహరణ అంటూ హర్ష నవ్వేశారు. చిరులోని ఈ కామెడీ టైమింగ్‌నే అనిల్ రావిపూడి సరిగ్గా వాడుకుంటే.. ‘మన శంకర వర ప్రసాద్’ బ్లాక్ బస్టర్ కావడం గ్యారెంటీ అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
This post was last modified on September 6, 2025 2:26 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…