హాలీవుడ్ లో లెక్కలేనన్ని హారర్ మూవీస్ వచ్చినప్పటికీ కొన్నింటికి మాత్రమే ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. వాటిలో ది కంజూరింగ్ ఒకటి. ఈ సినిమాటిక్ యునివర్స్ మొదటి భాగం 2013లో వచ్చి బ్లాక్ బస్టరయ్యింది. అప్పటిదాకా ఈవిల్ డెడ్ లాంటి కల్ట్ చిత్రాలకు ఉన్న ఫాలోయింగ్ ని ఇది కూడా పంచుకుంది. దెయ్యలతో భయపెట్టడాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన కంజూరింగ్ కి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. ది నన్, అన్నబెల్లెలు దీంతో కనెక్ట్ అయ్యి ఉన్నవే. కంజూరింగ్ టైటిల్ తో ఇప్పటిదాకా మూడు సినిమాలు రాగా ఆఖరిది మరియు నాలుగోది నిన్న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
యూఎస్ సంగతి ఏమో కానీ ఇండియాలో మాత్రం ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ ని ఎగబడి చూస్తున్న వైనం బుక్ మై షో ట్రెండ్స్ లో కనిపిస్తోంది. సగటున గంటకు 18 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. మాములుగా అవెంజర్స్, గాడ్జిలా లాంటి సూపర్ హీరోస్ కు మాత్రమే ఈ స్థాయి రెస్పాన్స్ ఉంటుంది. అయితే ప్రమోషన్ల పరంగా ఎలాంటి హడావిడి లేకుండా వచ్చిన లాస్ట్ పార్ట్ కు ఈ స్థాయి ఆదరణ దక్కడం చూసి ట్రేడ్ ఆశ్చర్యపోతోంది. వివిధ భాషల్లో వచ్చిన కొత్త రిలీజులు భాగీ 4, ఘాటీ, మదరాసి లాంటివి ఆశించిన స్థాయిలో స్పందన దక్కించుకోక పోవడంతో ఆ అవకాశాన్ని కంజూరింగ్ లాస్ట్ రైట్స్ ఫుల్లుగా వాడుకుంటోంది.
అలాని సినిమా అదిరిపోయిందనే టాక్ తెచ్చుకోలేదు. రాటెన్ టొమాటోస్ లో రేటింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ముగింపుని చప్పగా తేల్చేశారంటూ రివ్యూలలో నెగటివ్స్ నే ఎక్కువ హైలైట్ చేశారు. ఆత్మ పూనిన ఒక అద్దం ఉన్న బంగాళాలో ఎనిమిది కుటుంబ సభ్యులు ఎదుర్కునే భయానక సంఘటనల ఆధారంగా కంజూరింగ్ లాస్ట్ రైట్స్ తీశారు. అయితే మరీ థ్రిల్ ఇచ్చే స్థాయిలో ఇందులో హారర్ లేదని విమర్శకులు పెదవి విరుస్తున్నారు. అయినా సరే మన దేశంలో టాక్ ని పట్టించుకోకుండా ఈ చివరి దెయ్యాలను దర్శించుకోవడానికి ఆడియన్స్ ఎగబడుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది.
This post was last modified on September 6, 2025 12:45 pm
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…