కొత్త శుక్రవారం వచ్చేసింది. వేర్వేరు అంచనాలు, ప్రమోషన్లతో వచ్చిన మూడు సినిమాల జాతకం తేలిపోయింది. కమర్షియల్ గా ఎవరి స్థాయి ఏంటనేది సోమవారానికి క్లారిటీ వస్తుంది కానీ హిట్టు స్టేటస్ పక్కనపెడితే వీటిలో ఏదీ ఓ ముప్పై కోట్ల షేర్ వసూలు చేయడం జరగని పనిలా కనిపిస్తోంది. సరే వీటి జాతకం ఎలా ఉన్నా సరిగ్గా వారం రోజుల తర్వాత రాబోతున్న మిరాయ్ మీద థియేటర్ వ్యవస్థ బోలెడు ఆశలు పెట్టుకుంది. తేజ సజ్జ హీరో కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు చిన్న పిల్లల్లో సైతం ఇది ఆసక్తి రేపుతోంది. చాలా రీజనబుల్ బిజినెస్ జరుపుకున్న మిరాయ్ హిట్టయితే బయ్యర్లకు భారీ లాభాలొస్తాయి.
అదే రోజు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కిష్కిందపురి ఉంది కానీ హారర్ ఎలిమెంట్స్ వల్ల సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సో మిరాయ్ కు అది కూడా అడ్వాంటేజ్ కానుంది. సెప్టెంబర్ 25 ఓజి వచ్చేదాకా మిరాయ్ కు పదమూడు రోజులు ఓపెన్ గ్రౌండ్ దొరుకుతుంది. హనుమాన్ స్థాయి బ్లాక్ బస్టర్ దక్కుతుందని తేజ సజ్జ బలంగా నమ్ముతున్నాడు. పైగా ఇతర భాషల్లో బడా సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేస్తుండటంతో ఇండియా వైడ్ పెద్ద రిలీజ్ అందుకుంటోంది. బొమ్మ క్లిక్ అయితే మాత్రం తేజ సజ్జ రేంజ్ పెరగడంతో పాటు విలన్ గా మంచు మనోజ్ ఇతర బాషల డైరెక్టర్ల దృష్టిలో పడతాడు.
టాలీవుడ్ కున్న ప్రధాన సమస్య గత రెండు మూడు నెలలుగా వారాల తరబడి హౌస్ ఫుల్స్ చేయిస్తున్న సినిమా ఒక్కటి రాలేదు. ఏదైనా సరే వీకెండ్ హడావిడికి పరిమితమై తర్వాత నెమ్మదిస్తున్నాయి. కానీ మిరాయ్ అలా కాకూడదు. సరైన మూవీ లేదనే కారణంతోనే జనాలు థియేటర్ల వైపు పెద్దగా చూడటం లేదు. ఇప్పుడొకటి వస్తోందంటే ఖచ్చితంగా జనాలు కదులుతారు. కాకపోతే ఆ స్థాయి టాక్ ని మిరాయ్ తెచ్చుకోవాలి. మహావీర్ నరసింహ తప్ప ఈ మధ్య కాలంలో పబ్లిక్ కళకళలాడుతూ థియేటర్లలో కనిపించిన దాఖలాలు లేవు. మరి మిరాయ్ కనక ఆ లోటు తీరిస్తే మంచిదే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఈ హిట్టు చాలా ముఖ్యం.
This post was last modified on September 5, 2025 5:34 pm
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…