Movie News

వివాదాలు వాగ్వాదాలు… అయినా పాజిటివ్ టాక్

ది తాష్కెంట్ ఫైల్స్, ది కాశ్మీర్ ఫైల్స్ లాంటి వివాదాస్పద సినిమాలతో పేరు తెచ్చుకున్న సీనియర్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది బెంగాల్ ఫైల్స్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 3 గంటల 26 నిమిషాల సుదీర్ఘ నిడివితో చాలా పెద్ద కంటెంట్ ఇచ్చిన వివేక్ విడుదలకు ముందే కాంట్రవర్సీలు కొని తెచ్చుకున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లో ఈ మూవీని ప్రదర్శించేందుకు సింగల్ స్క్రీన్లు, మల్టీప్లెక్సులు వెనుకంజ వేయడం హాట్ టాపిక్ అయ్యింది. మమతా బెనర్జీ ప్రభుత్వం కావాలని తమ సినిమాను తొక్కి పెడుతోందని వివేజ్, ఆయన భార్య కం నటి పల్లవి జోషి ఆరోపిస్తున్నారు.

ఇంతగా వివాదం రేగడానికి కారణం వివేక్ అగ్నిహోత్రి తీసుకున్న బ్యాక్ డ్రాప్. 1946 కోల్కతాలో జరిగిన మారణహోమం, నోఖాలి అల్లర్లను కథాంశంగా తీసుకుని ఇందులో సవివరంగా చూపించారు. డైరెక్ట్ యాక్షన్ డేగా చరిత్రలో నిలిచిపోయిన ఆ సంవత్సరం ఆగస్ట్ 14 నాటి ఘటనలు, దాని పూర్వాపరాలు, అప్పటి స్వతంత్ర సమరయోధులు, నాయకులు ఏం చేశారనే పాయింట్ మీద ఇది రూపొందింది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి తదితర సీనియర్లు చాలానే నటించారు. అత్యంత ఎక్కువ నిడివి ఉన్న భారతీయ టాప్ 5 సినిమాల్లో ది బెంగాల్ ఫైల్స్ చోటు దక్కించుకోవడం గమనార్షం.

ఉత్తరాది రాష్ట్రాల్లో దీనికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. వివేక్ అగ్నిహోత్రి మరోసారి దేశాన్ని కుదిపేసే కథను చెప్పారని విమర్శలు మెచ్చుకుంటున్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ అప్పుడు రేగిన వసూళ్ల సునామి మళ్ళీ చూడొచ్చంటూ బయ్యర్లు ఆశలు పెట్టుకున్నారు. బిజెపి అజెండాను మోస్తారని పేరున్న వివేక్ ఈ నెగటివిటీని పట్టించుకోవడం లేదు. బెంగాల్ లో అనఫీషియల్ బ్యాన్ మీద పోరాడతానని అంటున్నారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మూర్ కు లేఖ కూడా రాశారు. హైదరాబాద్ లాంటి చోట్ల మంచి ఆక్యుపెన్సీలు నమోదు చేస్తున్న ది బెంగాల్ ఫైల్స్ నిజంగా జనాలను మెప్పించిందో లేదో తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాలి.

This post was last modified on September 5, 2025 3:46 pm

Share

Recent Posts

రావిపూడి మార్కు మళ్ళీ మొదలయ్యింది

ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…

4 minutes ago

ఇరుముడి ఇన్నింగ్స్ ఇంకా ఉన్నాయా

మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…

24 minutes ago

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

2 hours ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

3 hours ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

4 hours ago

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం…

8 hours ago