Movie News

అఖండ 2… అన్నివిధాలా అనుకూల నిర్ణయం

బాలకృష్ణ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న అఖండ 2 విడుదల తేదీ సస్పెన్స్ వీగిపోయింది. సంక్రాంతి బరిలో దిగుతుందేమోననే ప్రచారం గత కొద్దిరోజులుగా ఊపందుకుంది. దానికి చెక్ పెడుతూ బాలకృష్ణ స్వయంగా డిసెంబర్ మొదటి వారం రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పడంతో చిక్కు ప్రశ్నకు సమాధానం దొరికేసింది. అయితే ఫలానా డేట్ అని చెప్పలేదు కానీ రాజా సాబ్ వదిలేసిన డిసెంబర్ 5 దాదాపు లాకైనట్టే. ఆ రోజు శుక్రవారం కాబట్టి అదే ఖరారు చేయొచ్చు. ఇంకా దూరం ఉంది కాబట్టి ఇప్పుడప్పుడే నిర్మాత నుంచి అధికారిక ప్రకటన రాకపోవచ్చు.

తమన్ ఎక్కువ సమయం కోరడం వల్లే లేట్ అవుతోందని కుండబద్దలు కొట్టిన బాలయ్య నేరుగా ఓజి ప్రస్తావన తేలేదు కానీ దాని పనుల్లోనే అతను బిజీగా ఉండటం వల్ల అఖండ 2కి ఎక్కువ సమయం కేటాయించలేడన్నది ఓపెన్ సీక్రెట్. ఇదిలా ఉండగా అఖండ 2 చాలా తెలివైన నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 5 ఎలాంటి పోటీ లేదు. రణ్వీర్ సింగ్ దురంధర్ ఉంది కానీ దక్షిణాది మార్కెట్ లో దాని వల్ల వచ్చిన ఇబ్బందేమీ లేదు. పైగా దాని షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. ప్రమాదాలు, అవాంతరాలు అడ్డం వస్తుండటంతో టార్గెట్ రీచ్ కావడం గురించి బాలీవుడ్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

సో ఎలా చూసుకున్నా అఖండ 2కి సోలో గ్రౌండ్ దొరకడం కలెక్షన్ల పరంగా చాలా ప్లస్ కానుంది. మళ్ళీ డిసెంబర్ 25 దాకా చెప్పుకోదగ్గ రిలీజులు లేవు కాబట్టి వసూళ్లు గరిష్టంగా లాగించేయొచ్చు. బజ్ చూస్తుంటే అఖండ మొదటి భాగం రికార్డులను డబుల్ మార్జిన్ తో కొల్లగొట్టడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. దర్శకుడు బోయపాటి శీను ఈసారి విఎఫ్ఎక్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారట. ఓజి రిలీజ్ కాగానే అఖండ 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద తమన్ పని చేయబోతున్నాడు. గూస్ బంప్స్ తో థియేటర్లను షేక్ చేస్తానంటున్న తమన్ ఈసారి స్పీకర్లు కాదు ఏకంగా గోడలు బద్దలయ్యే స్కోర్ ఇస్తాడేమో చూడాలి.

This post was last modified on September 4, 2025 9:10 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

2 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

4 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

5 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

5 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

6 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

6 hours ago