క్రిష్ జాగర్లమూడి.. తెలుగు సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. తన తొలి చిత్రం ‘గమ్యం’ ఒక పెద్ద సెన్సేషన్. ఒక కొత్త దర్శకుడి నుంచి అంత డెప్త్ ఉన్న సినిమా రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప చిత్రాల్లో ఒకటిగా అది పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి క్లాసిక్స్ డెలివర్ చేశాడు క్రిష్.
ఐతే మీ కెరీర్లో బెస్ట్ మూవీ ఏది అని అడిగితే.. వీటన్నింటినీ కాదని తన కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిన ‘యన్.టి.ఆర్’ చిత్రం పేరు చెప్పాడు క్రిష్. లెజెండరీ నటుడు, రాజకీయ నేత ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఆయన రెండు భాగాలుగా తీసిన ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’, ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. క్రిష్ దర్శకుడిగా ప్రతిభ చాటుకున్నప్పటికీ.. ఆ సినిమా రిలీజైన టైమింగ్, అందులో సెలక్టివ్‌గా కొన్ని కీలక అంశాలను విస్మరించడం వల్ల ఆ సినిమాల ఫలితం తిరగబడింది.
ఐతే దర్శకుడిగా క్రిష్ కెరీర్లో బెస్ట్ మూవీ ఏది అంటే గమ్యం, కంచె, వేదం లాంటి సినిమాలనే ఎంచుకుంటారు ప్రేక్షకులు. ఆశించిన ఫలితాన్నందుకోకపోయినా ‘కృష్ణం వందే జగద్గురుం’ కూడా గొప్ప చిత్రమే. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కూడా ఉన్నతమైన సినిమానే. కానీ వీటన్నింటినీ పక్కన పెట్టి క్రిష్ ‘యన్.టి.ఆర్’ సినిమాను తన బెస్ట్ వర్క్‌గా చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయం.
‘యన్.టి.ఆర్’ సినిమా తనకు ఎమోషనల్‌గా పెద్ద సవాలు విసిరిందని.. ఎంతో కష్టపడి, మనసుపెట్టి ఆ సినిమా తీశానని.. ఎన్టీఆర్ కథను ప్రభావవంతంగా చెప్పడంతో పాటు బాలయ్య నుంచి బెస్ట్ పెర్ఫామెన్స్ రాబట్టానని.. అందుకే ఈ చిత్రాన్ని తన బెస్ట్ వర్క్‌గా భావిస్తానని క్రిష్ చెప్పాడు. క్రిష్ డైరెక్ట్ చేసిన కొత్త చిత్రం ‘ఘాటి’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on September 4, 2025 2:50 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…