రాబోయే నూతన సంవత్సరం సందర్భంగా అల్లరి నరేష్ తన కొత్త సినిమాతో టాలీవుడ్ కు బోణీ చేయబోతున్నాడు. జనవరి 1 ఆల్కహాల్ విడుదల కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చేశారు. సంక్రాంతికి విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ థియేటర్ రన్ పరిమితంగా మారుతుందని తెలిసీ నిర్మాణ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. గతంలో ఎన్నో సినిమాలు నూతన ఏడాది మొదటి రోజు రిలీజయ్యాయి కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. ఓ రెండు వారాలు రన్ రావాలంటే ఈ డేట్ సేఫ్ కాదనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్లు ఈ ఆప్షన్ పెట్టుకోవడం లేదు. కానీ సితార ఎంటర్ టైన్మెంట్స్ రిస్క్ తీసుకుంటోంది.
టీజర్ తో పాటు వచ్చిన ఈ అనౌన్స్ మెంట్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. వాటి ప్రకారం ఆల్కహాల్ లో అల్లరి నరేష్ కు మందు అలవాటు ఉండదు. తాగితే జీవితం నాశనం అవుతుందని అతని నమ్మకం. పని చేసే బాస్ ఆఫర్ చేసినా సరే నో అంటాడు. కానీ ఫ్రెండ్స్ కు మాత్రం డ్రింక్స్ పార్టీ ఇవ్వడం ఇతనికున్న విచిత్రమైన అలవాటు. ఒకవేళ తాను ఆఫర్ చేశాక తాగకపోతే కొడతాడు లేదా చంపుతానని బెదిరిస్తాడు. మరి ఇతని వింత ప్రవర్తనకు కారణం ఏంటి, ఎందుకిలా చేస్తున్నాడనేది తెరమీద చూసి తెలుసుకోవాలి. సెటిల్డ్ బాడీ లాంగ్వేజ్ తో అల్లరి నరేష్ కొత్తగా కనిపిస్తున్నాడు.
సీరియస్ జానర్ కు షిఫ్ట్ అయ్యాక అల్లరి నరేష్ కు పెద్దగా కలిసి రావడం లేదు. నాంది మినహాయించి మిగిలినవి ఫెయిలయ్యాయి. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం, బచ్చల మల్లి కనీస ఫలితం అందుకోలేదు. కామెడీ ట్రై చేద్దామని ఆ ఒక్కటి అడక్కు చేస్తే ప్రేక్షకులు మేము ఇలా అడగలేదు అంటూ రిజక్ట్ చేశారు. అందుకే ఇప్పుడు స్టైలిష్ ఫన్ వైపుకి వచ్చాడు. మెహర్ తేజ్ దర్శకత్వం వహించిన ఆల్కహాల్ కి జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. అల్లరి నరేష్. కమెడియన్ సత్యతో పాటు ఇతర ఆర్టిస్టులను పరిచయం చేసిన టీమ్ కథను చెప్పీ చెప్పకుండా అసలు ట్విస్టులు దాచి పెట్టింది. అవేంటో మరి.
This post was last modified on September 4, 2025 1:34 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…