ఈ మధ్య చిన్న సినిమాల ప్రమోషన్లలో హీరో హీరోయిన్లు దర్శకులు వాడుతున్న టెక్నిక్ సింపతీ. అంటే ఏదో ఒక రూపంలో సానుభూతి వచ్చేలా మాట్లాడ్డం ద్వారా సోషల్ మీడియా అటెన్షన్ తీసుకోవడం. వాళ్ళ ఆవేదనలో నిజం ఉండొచ్చు. బాధతోనే కన్నీళ్లు పెట్టుకుని ఉండొచ్చు. లేదా సవాళ్లు చేసి ఉండొచ్చు. కానీ టికెట్ కొనే ప్రేక్షకుడికి అవన్నీ అనవసరం. పెట్టిన డబ్బులకు న్యాయం జరిగిందా లేదా అనేది మాత్రమే చూస్తాడు. త్రిబాణధారి బార్బరీక్ డైరెక్టర్ రిలీజైన మరుసటి రోజు చెప్పుతో కొట్టుకుంటూ పెట్టిన వీడియో పెద్ద దుమారమే రేపింది. ఆ తర్వాత తన తొందరపాటుకి అతను క్షమాపణ చెప్పడం వేరే విషయం.
చిన్నదో పెద్దదో బలమైన కంటెంట్ ఉంటే తప్ప జనం థియేటర్లకు రావడం లేదు. బాగుందో లేదో చూసి చెప్పండని అడగటం వరకు బాగానే ఉంది. కానీ రెండు వందలు పెట్టి నేనెందుకు రిస్క్ తీసుకోవాలని ప్రేక్షకుడు ఆలోచిస్తున్నాడు. అందుకే ఓపెనింగ్స్ రావడం లేదు. రివ్యూలు, పబ్లిక్ టాక్ చూసి అప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాడు. పరదా రిలీజ్ కు ముందు పబ్లిక్ స్టేజి మీద దర్శకుడు ప్రవీణ్ మాట్లాడుతూ రివ్యూలు బాగుంటేనే రండని సవాల్ చేశాడు. తీరా చూస్తే ప్రయత్నాన్ని మెచ్చుకున్న విమర్శకులు కంటెంట్ లో లోపాలను మొహమాటం లేకుండా ఎండగట్టేశారు. ఫలితం రెండు రెండున్నర రేటింగే వచ్చింది.
మరి దర్శకుడు చెప్పిన ప్రకారం పబ్లిక్ సినిమాకు రాకూడదు. హిట్టయ్యాక ఏ స్టేట్ మెంట్ ఇచ్చినా చెల్లుతుంది. ఇంకా కాన్ఫిడెంట్ గా ఏమి పేలినా ఎవరూ పట్టించుకోరు. కొన్నేళ్ల క్రితం ఒక హీరో తన సినిమా ఫ్లాప్ అయితే పేరు మార్చుకుంటా అని శపథం చేశాడు. బొమ్మ పోయింది. తర్వాత ఏదో కవర్ చేసుకున్నాడు. ఇంకో మీడియం హీరో రెండు వందల కోట్ల గ్రాస్ తో ఫస్ట్ డే మొదలు పెడతా అన్నాడు. తీరా చూస్తే ఫైనల్ రన్ కూడా అంత రాక బయ్యర్లు నిండా మునిగారు. ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే ఎంత పబ్లిసిటి కోసమే అయినా మరీ అతిశయోక్తితో కూడిన స్టేట్ మెంట్లు ఇస్తే ఒక్కోసారి రివర్స్ కొడతాయి.
This post was last modified on September 3, 2025 10:29 pm
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…