ఓజీ.. ఓజీ.. ఓజీ.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులే కాక.. తెలుగు సినిమా ప్రియులందరూ ఈ నామస్మరణే చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న ఈ కొత్త చిత్రానికి హైప్ మూమూలుగా లేదు. పవన్ గత చిత్రం ‘హరిహర వీరమల్లు’ డిజాస్టర్ అయినా.. అంతకుముందు ఆయన్నుంచి వచ్చిన ‘బ్రో’ కూడా నిరాశపరిచినా.. ఆ ప్రభావం ‘ఓజీ’ మీద ఎంతమాత్రం పడలేదు. రోజు రోజుకూ ‘ఓజీ’ హైప్ పెరుగుతోందే తప్ప తగట్లేదు.
లేటెస్ట్‌గా పవన్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో సినిమాకు బజ్ ఇంకా పెరిగింది. ‘ఓజీ’కి వారం కిందటే యుఎస్‌లో బుకింగ్స్ ఓపెన్ చేయగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే ప్రి సేల్స్ 1 మిలియన్ డాలర్లకు చేరువగా వచ్చేయడం విశేషం. విడుదలకు ఇంకా మూడు వారాల సమయం ఉండగానే ఇంత వసూళ్లు వచ్చాయంటే.. ప్రిమియర్స్‌తోనే ఈజీగా ఈ చిత్రం 3 మిలియన్ మార్కును టచ్ చేయడం గ్యారెంటీ.
కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు.. వీకెండ్లో 5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయడం లాంఛనమే కావచ్చు. ఈ సినిమా యుఎస్ హక్కులను డిస్ట్రిబ్యూటర్ చాలా ముందుగానే సొంతం చేసుకున్నాడు. ఇక సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే భారీ లాభాలు గ్యారెంటీ.
తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ఏరియాలకు ముందే అడ్వాన్సులు ఇచ్చారు కొందరు బయ్యర్లు. వాళ్లకు కూడా రీజనబుల్ రేటుకు సినిమా దక్కుతుంది. ఇప్పుడు హైప్, బాక్సాఫీస్ అనుకూల పరిస్థితుల్లో సినిమా మంచి లాభాలను అందించే అవకాశముంది. ఈ ఏడాది పెద్ద సినిమాలు చాలా వరకు డిస్ట్రిబ్యూటర్లను దెబ్బ కొట్టినవే. ‘ఓజీ’ హైప్‌కు తగ్గట్లు ఉంటే మాత్రం ఈ సినిమాపై పెట్టుబడి పెట్టిన వాళ్లందరికీ మంచి ఫలితమే దక్కొచ్చు.
This post was last modified on September 3, 2025 4:15 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…