ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో తర్వాతి సినిమా మీద ఆటోమేటిక్ గా అంచనాలు పెరుగుతాయి. కానీ శివ కార్తికేయన్ కు వింత అనుభవం ఎదురవుతోంది. ఎల్లుండి విడుదల కాబోతున్న మదరాసి మీద తమిళనాడులో ఆశించిన బజ్ కనిపించకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. అమరన్ తర్వాత సుమారుగా ఏడాది గ్యాప్ వచ్చేసింది. శివ కార్తికేయన్ కున్న ఇమేజ్, ఫాలోయింగ్ దృష్ట్యా ఇప్పటికే బుక్ మై షోలో టికెట్లు హాట్ కేకులు అయిపోవాలి. సోషల్ మీడియాలో హంగామా కనిపించాలి. కానీ మదరాసి విషయంలో అంత హడావిడి లేదన్నది వాస్తవం. ప్రమోషన్లైతే చేస్తున్నారు కానీ జనాలకు పూర్తిగా రీచ్ కావడం లేదు.
దీనికి ప్రధాన కారణం దర్శకుడు ఏఆర్ మురుగదాస్ బ్రాండ్. వరస డిజాస్టర్లతో తన ఉనికిని రిస్కులో పెట్టుకున్న ఈ కల్ట్ డైరెక్టర్ ఇప్పుడు కంబ్యాక్ కోసం విపరీతంగా కష్టపడుతున్నారు. సికందర్ డిజాస్టర్ వెనుక కారణం నేను కాదు సల్మాన్ ఖాన్ అంటూ నింద హీరో మీదకు తోసేయాలని చూడటం ఆన్ లైన్లో మిస్ ఫైర్ అయ్యింది. పైగా తమిళ దర్శకులు జ్ఞానం ఇవ్వడానికి సినిమాలు తీస్తారని, అందుకే వెయ్యి కోట్ల గ్రాసర్ మా దగ్గర లేవని కామెంట్ చేయడం ఇతర బాషల సినీ ప్రియులను ఆగ్రహానికి గురి చేసింది. థియేటర్ ఏమైనా యునివర్సిటినా అంటూ ట్విట్టర్, ఇన్స్ టాలో గట్టిగానే క్లాసులు తీసుకున్నారు.
అనిరుద్ రవిచందర్ పేరు సైతం మదరాసి మీద అంచనాలు పెంచలేకపోతోంది. తను కూడా దేవర తర్వాత తన స్థాయి ఆల్బమ్ ఇవ్వలేదు. కూలి జస్ట్ ఓకే కానీ మరీ జైలర్ రేంజ్ లో మ్యూజిక్ పండలేదు. మదరాసికి ఇచ్చిన పాటలు పెద్దగా వైరల్ కాలేదు. హీరోయిన్ రుక్మిణి వసంత్ తనవంతుగా ప్రమోషన్లలో భాగమవుతున్నా ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చెప్పలేం. ఎల్లుండి మదరాసికి వచ్చే టాక్ చాలా కీలకం కానుంది. మురుగదాస్ అయితే తుపాకీ రేంజ్ లో హామీ ఇస్తున్నారు. ఆ నమ్మకం ఏ మాత్రం నిలబెట్టుకోలేకపోయినా ట్రోలింగ్ తప్పదు. మన దగ్గర ఘాటీ, లిటిల్ హార్ట్స్ తో మంచి పోటీనే ఉంది.
This post was last modified on September 3, 2025 1:02 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…