తెలుగులో ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ.. అప్పుడప్పుడూ విజయాలు అందుకుంటూ కెరీర్‌ను బాగానే ముందుకు తీసుకెళ్లాడు బెల్లంకొండ శ్రీనివాస్. కానీ మధ్యలో ‘ఛత్రపతి’ బాలీవుడ్ రీమేక్‌లో నటించడం తన కెరీర్‌కు పెద్ద డ్యామేజీ అయింది. ఆ సినిమా హిందీలో సరిగా ఆడలేదు. పైగా తెలుగులో బాగా గ్యాప్ వచ్చింది. ఈ విరామం తర్వాత ‘భైరవం’ చిత్రంలో నటిస్తే అది నిరాశపరిచింది. ఐతే తన కొత్త చిత్రం ‘కిష్కింధపురి’ మీద బెల్లంకొండ శ్రీనివాస్ చాలా నమ్మకంగా ఉన్నాడు. కార్తికేయతో ‘చావు కబురు చల్లగా’ సినిమా తీసిన కౌశిక్ పెగల్లపాటి ఈ చిత్రాన్ని రూపొందించాడు.
ఇది డివైన్ ఎలిమెంట్స్‌తో ముడిపడ్డ ఫాంటసీ హార్రర్ మూవీ. దీని టీజర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. ‘రాక్షసుడు’ తర్వాత శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన చిత్రమిది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 12న ‘కిష్కింధపురి’ రిలీజ్ కావాలి. ఐతే అదే రోజు ‘మిరాయ్’ భారీ అంచనాల మధ్య రిలీజవుతుండడంతో దానికి పోటీగా వెళ్లకపోవడం మంచిదే అన్న సందేహాలు కలిగాయి.
రిలీజ్ డేట్ మార్చక తప్పదని అనుకున్నారు. ఆ ప్రకారమే ‘కిష్కింధపురి’ వాయిదా పడింది. అలా అని వారం, రెండు వారాలేమీ పోస్ట్ పోన్ చేయలేదు. ఒక్క రోజు ఆలస్యంగా సెప్టెంబరు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. 13న అన్నది హార్రర్ చిత్రాలకు సెంటిమెంటుగా కలిసొచ్చే డేట్. హార్రర్ చిత్రాల టైటిళ్లు కూడా ఈ నంబర్‌తో పెడుతుంటారు. ‘13 బి’ అందుకు ఉదాహరణ. ‘మిరాయ్’తో పోటీ మంచిది కాదని, సెంటిమెంటుగా కూడా కలిసొస్తుందని 13ను రిలీజ్ డేట్‌గా ఎంచుకున్నట్లున్నారు. 12న రావాాల్సిన మరో చిత్రం ‘కాంత’ ఆ వీకెండ్ నుంచి వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తోంది. ‘కిష్కింధపురి’కి సామ్ సీఎస్, చేతన్ భరద్వాజ్ సంగీతాన్నందించగా.. షైన్ స్క్రీన్స్ అధినే సాహు గారపాటి ప్రొడ్యూస్ చేశాడు.
This post was last modified on September 1, 2025 5:07 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…