గత కొన్నేళ్లలో అనుష్క శెట్టి సినిమాల ఫ్రీక్వెన్సీ బాగా తగ్గిపోయింది. ఆరేళ్ల వ్యవధిలో మూడు సినిమాలే చేసింది. 2020లో ‘నిశ్శబ్దం’తో పలకరించిన ఆమె.. రెండేళ్ల కిందట ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మళ్లీ ఇప్పుడు ‘ఘాటి’తో బాక్సాఫీస్ బరిలోకి నిలిచింది. ఈ సినిమా తర్వాత తెలుగులో అనుష్క ఏ సినిమా చేస్తుంది అంటే సమాధానం లేదు. ఆమెకు కొత్త కమిట్మెంట్లు ఏవీ లేవు. అసలు తెలుగులో మళ్లీ ఇంకో సినిమా చేస్తుందా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. కానీ ఆమెను ఇక వెండితెరపై చూడలేం అనుకోవడానికేమీ లేదు.
బలమైన కంటెంట్‌తో సినిమాలు తీసే మలయాళ ఇండస్ట్రీలోకి ఆమె అడుగు పెడుతుండడం విశేషం. అక్కడ ఓ భారీ చారిత్రక చిత్రంలో అనుష్క నటిస్తున్న విషయం చాలా మందికి తెలియదు. ఆ సినిమా పేరు.. కథనార్. మలయాళంలో మిడ్ రేంజ్ హీరోల్లో ఒకడైన జయసూర్య ‘కథనార్’లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా అతడికి డ్రీమ్ ప్రాజెక్టు. తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతోంది. దీని కోసం రెండేళ్ల నుంచి శ్రమిస్తున్నాడు జయసూర్య.
ఇందులో అతడికి జోడీగా కల్లియకట్టు నీలి అనే పాత్రలో నటిస్తోంది. హీరో లాగే ఆమెది కూడా ఒక యోధురాలి పాత్రే. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. రుద్రమదేవి, బాహుబలి, భాగమతి చిత్రాల తర్వాత ఆమెకిది పవర్ ఫుల్ రోల్ అవుతుందని భావిస్తున్నారు. మలయాళంలో హీరోయిన్ల వయసు, గ్లామర్‌తో సంబంధం లేకుండా మంచి మంచి పాత్రలు ఇస్తుంటారు. అనుష్కకు ఈ సినిమా బ్రేక్ ఇస్తే.. ఆమెకు అక్కడ ఆల్టర్నేట్ కెరీర్ లభించినా ఆశ్చర్యం లేదు. ఎలాగూ మలయాళం సినిమాలకు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కుతోంది కాబట్టి అనుష్కను మున్ముందు అక్కడి సినిమాల్లో రెగ్యులర్‌గా చూస్తే అది మంచి విషయమే అవుతుంది.
This post was last modified on September 1, 2025 5:01 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…