Movie News

కల్కి-2 షూట్, రిలీజ్ గురించి నాగ్ అశ్విన్

ఇండియాలో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ‘కల్కి-2’ ఒకటి. ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌ల క్రేజీ కాంబినేషన్లో నాగ్ అశ్విన్ రూపొందించిన ‘కల్కి’ గత ఏడాది విడుదలై ఘనవిజయాన్నందుకుంది. ఆ కథను మధ్యలో ఆపడంతో రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఆ సినిమా విడుదలై ఏడాది దాటినా ఇంకా సెకండ్ పార్ట్ షూట్ గురించి ఏ అప్‌డేట్ లేదు. నాగ్ అశ్విన్ స్క్రిప్టు రెడీ చేసుకుని, ప్రి ప్రొడక్షన్ పనులు కూడా ఒక కొలిక్కి తెచ్చేశాడు కానీ.. ప్రభాస్ వేరే చిత్రాలతో బిజీగా ఉండడంతో ఎదురు చూపులు తప్పడం లేదు.

మరి ఈ సినిమా షూట్ ఎప్పుడు మొదలవుతుంది.. రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అన్నదానిపై అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. దీని గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక పాడ్ కాస్ట్‌లో మాట్లాడాడు. ‘‘కల్కి-2 షూట్ చాలా అంశాలతో ముడిపడి ఉంది. ‘కల్కి’లోని ముఖ్య పాత్రధారులందరితో కాంబినేషన్ సీన్లు ఉన్నాయి. అందుకే వాళ్లందరికీ కుదిరినపుడే చిత్రీకరణ జరపాలి. ఇందులో యాక్షన్ సన్నివేశాలు పార్ట్-1ను మించి ఉంటాయి. వాటిని పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది.

అందుకే ‘కల్కి-2’ రిలీజ్ గురించి నా దగ్గర కచ్చితమైన సమాధానం లేదు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నాం. కానీ ప్రస్తుతం ‘కల్కి’ స్టార్స్ అందరూ బిజీగా ఉన్నారు. కాబట్టి ఫలానా టైంలో షూట్ మొదలవుతుందని చెప్పడం కష్టం. ఐతే షూటింగ్‌కు తక్కువ సమయమే పట్టినా.. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌కు చాలా టైం పడుతుంది. ఇంకో రెండేళ్ల వ్యవధిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాం. ఏం జరుగుతుందో చూడాలి’’ అని నాగి చెప్పాడు. ‘కల్కి’లో ప్రభాస్, కమల్ హాసన్‌ల పాత్రల పరిధి తక్కువ అని ప్రేక్షకులు ఒకింత అసంతృప్తికి గురయ్యారు. కానీ పార్ట్-2లో వీళ్ల పాత్రలు ఇంకా బలంగా, ఎక్కువ నిడివితో ఉంటాయని తెలుస్తోంది.

This post was last modified on September 1, 2025 4:48 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

6 minutes ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

1 hour ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

2 hours ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

2 hours ago

ఊరి కోసం పోరాడే రియల్ ‘ఛాంపియన్’

నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…

3 hours ago

తప్పు తెలుసుకున్న యువ హీరో

స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…

3 hours ago