రుద్రమదేవి సినిమాలో లీడ్ రోల్ చేసిన అనుష్కను మించి.. ప్రత్యేక పాత్ర చేసిన అల్లు అర్జున్ ఎక్కువ హైలైట్ అయ్యాడు అనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ ఆ రోజుల్లోనే రూ.60 కోట్లకు పైగా షేర్ సాధించిందన్నా.. అనుష్క మార్కెట్‌ను మించి భారీగా బడ్జెట్ పెట్టిన గుణశేఖర్ సేఫ్ జోన్లోకి వచ్చాడన్నా.. అల్లు అర్జున్ చేసిన గోన గన్నారెడ్డి పాత్ర కీలకం అనడంలో సందేహం లేదు.
బన్నీ కనిపించిన ప్రతి సన్నివేశం, అతను పలికిన ప్రతి డైలాగ్ హైలైట్‌గా నిలిచాయి. బన్నీ ఫ్యాన్సునేకాక అన్ని వర్గాల ప్రేక్షకులనూ తన పాత్ర ఆకట్టుకుని సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ఐతే నిజానికి ఆ పాత్రను బన్నీ చేయాల్సింది కాదట. గుణశేఖర్ ఫస్ట్ ఛాయిస్ వేరొకరట. అతనెవరో కాదు.. తమిళ నటుడు విక్రమ్ ప్రభు. లెజెండరీ నటుడు శివాజీ మనవడు, ప్రభు కొడుకు అయిన విక్రమ్ ప్రభుకు.. తమిళంలో మంచి పేరే ఉంది.
తమిళంలో ‘కుంకి’ సహా పలు హిట్ చిత్రాల్లో నటించిన విక్రమ్ ప్రభును ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్ర కోసం గుణశేఖర్ అడిగాడట. కానీ అప్పటికి తనకు ఖాళీ లేకపోవడం వల్ల ఆ సినిమా చేయలేకపోయానని విక్రమ్ ప్రభు తెలిపాడు. విక్రమ్ ప్రస్తుతం అనుష్క సినిమా ‘ఘాటి’లో కీలక పాత్ర చేశాడు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా తాను మిస్ అయిన గోన గన్నారెడ్డి పాత్ర గురించి చెప్పాడు విక్రమ్. ఐతే ఆ పాత్రను బన్నీ అద్భుతంగా చేశాడని.. కాబట్టి దాన్ని మిస్సయినందుకు బాధ లేదని విక్రమ్ తెలిపాడు.
విక్రమ్ ఆ పాత్ర చేస్తే తమిళంలో కలిసి వస్తుందని గుణశేఖర్ భావించి ఉండొచ్చు. కానీ తెలుగులో సినిమా అంచనాలను మించి ఆడిందంటే బన్నీ ఆ పాత్ర చేయడం వల్లే. ఆ క్యారెక్టర్ కోసం బన్నీ పారితోషకం కూడా తీసుకోకపోవడం గమనార్హం. ఆ పాత్ర బన్నీకి మంచి పేరు తేవడంతో పాటు సినిమాకు పెద్ద ఆకర్షణగా నిలిచి గుణశేఖర్‌ను నిలబెట్టింది. లేదంటే అతను బాగా ఇబ్బంది పడేవాడే.
This post was last modified on August 31, 2025 6:11 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…