కొత్త నెల రాబోతోంది. ఆగస్ట్ లో బాక్సాఫీస్ పరంగా అద్భుతాలు జరగకపోవడం ట్రేడ్ ని నిరాశ పరిచింది. ఎన్నో ఆశలు పెట్టుకుని కనకవర్షం కురిపిస్తాయని భావించిన వార్ 2, కూలీ నిరాశ పరచడంతో ఆశలన్నీ సెప్టెంబర్ మీదే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఓజితో సహా చాలా క్రేజీ రిలీజులు క్యూ కట్టడంతో హాళ్లు మళ్ళీ కళకళలాడతాయని భావిస్తున్నారు. ఆగస్ట్ చివర్లో కొత్త లోక కొంత తెరిపినిచ్చింది కానీ అది డబ్బింగ్ సినిమా కావడం, మాస్ రీచ్ తక్కువగా ఉండటం లాంటి కారణాల వల్ల మరీ ఎక్కువ రెవిన్యూ ఆశించలేం. వీకెండ్ డ్రాప్స్ మీద ఫైనల్ స్టేటస్ ఆధారపడి ఉంది. ఇప్పుడు తొలి వారంలో క్లాష్ ఆసక్తికరంగా ఉండబోతోంది.
సెప్టెంబర్ 5 అనుష్క ‘ఘాటీ’ మీద ఆడియన్స్ ఆసక్తిగానే ఉన్నారు. ప్రమోషన్లకు హీరోయిన్ రాకపోయినా ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం పబ్లిసిటీ భారం నిర్మాత, హీరో, దర్శకుడు పంచుకుంటున్నారు. పుష్ప తరహాలో స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఘాటీకి క్రిష్ దర్శకత్వం వహించడం అంచనాలు రేపుతోంది. సోషల్ మీడియా స్టార్ మౌళి హీరోగా చేసిన ‘లిటిల్ హార్ట్స్’ యూత్ ని టార్గెట్ చేసుకుంది. మ్యాడ్ తరహాలో సర్ప్రైజ్ హిట్ అవుతుందనే నమ్మకం నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాస్ లో కనిపిస్తోంది. శివ కార్తికేయన్ ‘మదరాసి’ మీద తెలుగులో పెద్దగా బజ్ లేదు. మురుగదాస్ బ్రాండ్ కొంత మైనస్ అవుతోంది.
అమరన్ తర్వాత సినిమా కావడంతో రేట్లు ఎక్కువగానే చెప్పారట కానీ హెవీ ఓపెనింగ్స్ ఆశించకపోయినా మౌత్ టాక్, రివ్యూస్ బాగుంటే క్రమంగా పికపయ్యే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ఇవి కాకుండా హాలీవుడ్ హారర్ మూవీ ‘ది కంజురింగ్ ఫైనల్ రైట్స్’ ని డబ్బింగ్ వెర్షన్ తో పాటు తీసుకొస్తున్నారు. ఇదేమి భయపడే కాంపిటీషన్ కాదు కానీ మల్టీప్లెక్సుల్లో మంచి షోలే పడతాయి. కాంట్రావర్సిని మోసుకొస్తున ‘ది బెంగాల్ ఫైల్స్’ ఊహించని సెన్సేషన్ అవుతుందని నార్త్ బయ్యర్లు అంచనా వేస్తున్నారు. తెలుగు వరకు చూసుకుంటే ప్రధానమైన పోటీ ఘాటీ, లిటిల్ హార్ట్స్, మదరాసి మీద ఉంది. చూడాలి ఎవరు విన్ అవుతారో.
This post was last modified on August 31, 2025 12:16 pm
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…