ఇటీవలే హీరో తేజ సజ్జ నిర్మాత ప్రియాంక దత్ పుట్టినరోజు సందర్భంగా ఇన్స్ టా స్టేటస్ లో ఒక పిక్ పెట్టడం ప్రభాస్ అభిమానుల్లో కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. తనతో పాటు ప్రియాంక, స్వప్న ఇద్దరితో ఉన్న ఫోటో పోస్ట్ చేసి ‘సి యు ఇన్ కల్కి’ అని చివర్లో క్యాప్షన్ పెట్టడం చర్చకు దారి తీసింది. మెసేజ్ లో హనుమాన్ వర్సెస్ కల్కి అని చిన్న ఎమోజి పెట్టడం మరింత కవ్వించింది. అంటే కల్కి 2లో తేజ సజ్జ ఉంటాడా లేక హనుమాన్ పాత్రను సీక్వెల్ లో భాగం చేయబోతున్నారానేది సస్పెన్స్ ని పెంచింది. ఒకవేళ నిజంగా ఈ కాంబో కనక సాధ్యమైతే ఆడియన్స్ లో ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇదో క్రేజీ కాంబినేషన్ అవుతుంది
తేజ సజ్జ మాటల్లో అంత అర్థం ఉందా అంటే అనుమానంగానే ఉంది. ఎందుకంటే హనుమాన్ తర్వాత సోలో హీరోగా కెరీర్ బిల్డ్ చేసుకుంటున్న తేజ సజ్జ ప్రస్తుతం క్యామియోలు చేసే ఆలోచనలో లేడు. అందులోనూ ప్రభాస్ లాంటి కటవుట్ ముందు ఏ పాత్ర చేసినా జనాల కంటికి అనదు. సో ఫిలిం ఫెస్టివల్ లో ప్రియాంక, స్వప్నను కలుసుకున్నప్పుడు సరదాగా పెట్టిన ఫోటో తప్ప అంతకు మించి వేరే అర్థం లేదని చెప్పొచ్చు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. తేజ సజ్జ చైల్డ్ ఆర్టిస్ట్ గా చూడాలని ఉంది లాంటి సినిమాలు వైజయంతి బ్యానర్ లో చేశాడు. అప్పుడు స్వప్న, ప్రియాంకలు కూడా పిల్లలే.
సో అప్పటి నుంచి ఫ్రెండ్ షిప్ అలా కొనసాగుతోంది కాబట్టి ఇలా కలిసి స్మైల్స్ ఇచ్చారు కానీ అంతకన్నా డీప్ మీనింగ్ ఉండకపోవచ్చు. ఇంతకీ కల్కి 2 ఎప్పుడు స్టార్ట్ చేస్తారో దర్శకుడు నాగ అశ్విన్, నిర్మాత అశ్విని దత్ లకే తెలియదు. ప్రభాస్డ్ డేట్లు, ఇతర ఆర్టిస్టుల కాల్ షీట్లు, కమల్ హాసన్ అందుబాటు ఇవన్నీ చెక్ చేసుకుని కానీ సెట్స్ పైకి వెళ్ళలేరు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తేజ సజ్జ కల్కి 2లో ఉంటాడనేది కేవలం ఊహాగానం మాత్రమే. మే 12 విడుదల కాబోతున్న మిరాయ్ తో మరో పెద్ద బ్రేక్ అందుకోవాలని ఎదురు చూస్తున్న తేజ సజ్జకు సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ట్రైలర్ తో మరింత పెరిగాయి.
This post was last modified on August 31, 2025 11:57 am
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…