Movie News

అల్లు క‌న‌క‌ర‌త్న‌మ్మ‌… చిరు స్ఫూర్తితో

మెగా, అల్లు కుటుంబాల్లో శ‌నివారం విషాదం అలుముకుంది. అల్లు రామలింగయ్య స‌తీమ‌ణి.. అల్లు అర‌వింద్, సురేఖ‌ల త‌ల్లి అయిన అల్లు అల్లు కనకరత్నం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ శనివారం తెల్లవారుజామున‌ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె వ‌య‌సు 94 సంవ‌త్స‌రాలు. క‌న‌క‌ర‌త్న‌మ్మ మ‌ర‌ణ వార్త తెలియ‌గానే చిరంజీవి స‌హా మెగా కుటుంబ స‌భ్యులు ప‌లువురు అల్లు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. చిరంజీవి ద‌గ్గ‌రుండి అన్ని కార్య‌క్ర‌మాలూ చూసుకున్నారు. స్వ‌యంగా అత్త‌గారి పాడె మోశారు. అంత్య‌క్రియ‌ల్లోనూ పాల్గొన్నారు. ఇదే రోజు సాయంత్రం ఒక ఆసుప‌త్రికి సంబంధించిన ప్రైవేటు కార్య‌క్ర‌మ‌లో చిరు.. క‌న‌క‌ర‌త్న‌మ్మ‌కు సంబంధించి ఓ ముఖ్య‌మైన విష‌యాన్ని వెల్లడించారు.

త‌న మ‌ర‌ణానంత‌రం క‌న‌క‌ర‌త్నమ్మ త‌న క‌ళ్ల‌ను దానం చేశారు. ఈ మేర‌కు ఆమె ముందే తీర్మాన ప‌త్రం మీద సంత‌కం చేశారు. క‌న‌క‌ర‌త్న‌మ్మ బ‌తికి ఉన్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి చేపట్టిన బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ వంటి కార్యక్రమాలకు ప్రభావితులయ్యారట‌. తాను మరణించిన తర్వాత తన కళ్ళను దానం చేయాలని కుటుంబ సభ్యులకు చెప్పారట‌.. త‌న‌ కోరిక ప్ర‌కార‌మే మరణించిన తర్వాత ఆమె కళ్ళను అల్లు కుటుంబం దానం చేసింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో తెలియజేశారు. క‌న‌క‌ర‌త్న‌మ్మ‌ నేత్ర‌దానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని మెగాస్టార్ పేర్కొన్నారు. 

అర్ధరాత్రి 2 గంటలకు అరవింద్ కి ఫోన్ చేసి అత్తమ్మ కళ్ళదానం గురించి అడిగితే ఒకే అన్నాడని. గతంలో కేవలం తాను అడగానే అత్తమ్మ ఓకే అంద‌ని… ఈ రోజు ఉదయమే కళ్లదానం జరిగిందని చిరు వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా.. గ‌త కొన్నేళ్ల‌లో అనుకోని ప‌రిణామాల వ‌ల్ల మెగా, అల్లు కుటుంబాల మ‌ధ్య కొంత గ్యాప్ వ‌చ్చిన‌ట్లు క‌నిపించింది. మెగా హీరోలు.. బ‌న్నీ దూరం దూరంగా ఉంటున్నారని రోజు సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఐతే అల్లు క‌న‌క‌ర‌త్నమ్మ మ‌ర‌ణించిన సంద‌ర్భంగా చిరు, చ‌ర‌ణ్‌, వ‌రుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణ‌వ్ తేజ్.. అల్లు వారి ఇంటికి వ‌చ్చి ఆ కుటుంబంతో స‌న్నిహితంగా మెలిగారు. బ‌న్నీతో వీళ్లంద‌రూ స‌న్నిహితంగా ఉండ‌డం మెగా యూనైటెడ్ ఫ్యాన్స్‌కు ఆనందాన్నిచ్చింది.

This post was last modified on August 31, 2025 10:39 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

13 minutes ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

1 hour ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

1 hour ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

4 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

5 hours ago

అమరావతిపై జగన్‌కు 5 ప్రశ్నలు..!

అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…

7 hours ago