నిర్మాణంలో ఉన్నప్పుడు ఏమో కానీ ట్రైలర్ వచ్చాక మిరాయ్ మీద అంచనాలు మారిపోయాయి. హనుమాన్ రేంజ్ లో మరోసారి తేజ సజ్జ క్వాలిటీ అవుట్ ఫుట్ తో వస్తున్నట్టు జనాలకు అర్థమైపోయింది. దీంతో డిమాండ్ పెరిగిపోయింది. సెప్టెంబర్ 12 విడుదల లాక్ చేసుకున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో మంచు మనోజ్ విలనీ ప్రత్యేక ఆకర్షణ. 1600కి పైగా సిజి షాట్స్ తో గొప్ప అనుభూతినిస్తుందని టీమ్ నమ్మకంగా చెబుతోంది. ప్రస్తుతం చివరి దశ పనులు జరుగుతున్నాయి. వారంలోపు వాటిని కొలిక్కి తెచ్చి సెన్సార్ పూర్తి చేయబోతున్నారు. తమిళ, హిందీ, మలయాళం, కన్నడలో పెద్ద సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి.
ఇక తెలుగు థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సుమారు 25 కోట్లకు డీల్స్ క్లోజ్ చేశారని ఇన్ సైడ్ టాక్. మిరాయ్ కున్న గ్రాండియర్ లుక్ చూస్తుంటే ఇది చాలా రీజనబుల్ రేట్. పాజిటివ్ టాక్ వస్తే మొదటి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ దాటిపోయి లాభాలు వస్తాయి. ఇక్కడ పని చేసేది తేజ సజ్జ మార్కెట్ కాదు. కంటెంట్ లో చూపించిన వైవిధ్యం సినిమాలోనూ ఉంటుందనే నమ్మకం. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి ట్రాక్ రికార్డు పరంగా బ్లాక్ బస్టర్లు లేనప్పటికీ మిరాయ్ ని అతను తీర్చి దిద్దుతున్న తీరు గురించి వస్తున్న అప్డేట్స్ అంచనాలు ఏర్పరుస్తూ వెళ్లాయి.
అత్యాశకు వెళ్లకుండా మిరాయ్ ని ఈ రేట్లకు ఇవ్వడం నిజమైతే ఒక రకంగా ఇతర సినిమాలకు రోల్ మోడల్ అవుతుంది. దీనికి తోడు టికెట్ రేట్ల పెంపుకి వెళ్లే ఆలోచన లేదని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చెప్పడం ఎగ్జిబిటర్ల చెవిలో పాలు పోసినట్టు అయ్యింది. ఎందుకంటే చీటికీ మాటికీ ప్రతి సినిమాకి యాభై నుంచి నూటా యాభై రూపాయల దాకా పెంచుకుంటూ పోవడం యావరేజ్, ఫ్లాప్ సినిమాలను దారుణంగా దెబ్బ కొడుతోంది. నిర్మాతలు ఈ వాస్తవాన్ని విస్మరించి రివ్యూలు, ఆన్ లైన్ టాకుల మీద నెపం నెట్టేస్తున్నారు. హనుమాన్ సైతం రెగ్యులర్ రేట్లతోనే వందల కోట్లు కొల్లగొట్టిన వైనాన్ని మర్చిపోకూడదు.
This post was last modified on August 30, 2025 2:43 pm
నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…
జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…
ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…
మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…
తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…