టాలీవుడ్ లో డెబ్యూ మూవీ దేవరతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన జాన్వీ కపూర్ కి హిందీలో మాత్రం ఆ స్థాయి సక్సెస్ దక్కక ఏళ్ళు గడిచిపోతున్నాయి. పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న సినిమాలు ఎన్ని చేసినప్పటికీ అవేవి కమర్షియల్ గా వర్కౌట్ కాకపోవడంతో సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. తాజాగా పరమ్ సుందరిగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ లవ్ ఎంటర్ టైనర్ కు తుషార్ జలోటా దర్శకత్వం వహించాడు. చెన్నై ఎక్స్ ప్రెస్, టూ స్టేట్స్ లాంటి పాత సినిమాల ఛాయలున్నాయనే కామెంట్స్ వచ్చినప్పటికీ మ్యూజిక్ ప్లస్ కావడంతో ఓ మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. కానీ అవి నిలబడలేదు.
తీరా చూస్తే ఈ పరమ్ సుందరి పరేషాన్ చేసేలా ఉంది. తాతల కాలం నాటి పాయింట్ ఒకటి తీసుకుని దానికి ఏఐ, యాప్స్ అనే కోటింగ్ ఇచ్చి ప్రేక్షకుల సహనంతో ఫుట్ బాల్ ఆడేసుకున్నారు. పరమ్ అనే కుర్రాడు చేసిన స్టార్ట్ అప్ బిజినెస్ లన్నీ టపా కట్టేస్తాయి. విసుగెత్తిన తండ్రితో ఛాలెంజ్ చేసి జీవిత భాగస్వామిని ఆన్ లైన్ లో ఎంచుకునే ఒక యాప్ కనిపెడతాడు. దాని పనితనం చూపించడం కోసం కేరళ వెళ్లి అక్కడ స్టే హోమ్ నడిపే సుందరి ప్రేమలో పడతాడు. కానీ అప్పటికీ ఆ అమ్మాయికి కాబోయే భర్త వేరే ఉంటాడు. అప్పుడు, ఆ తర్వాత జరిగేది చిన్న పిల్లాడు సైతం ఈజీగా గుర్తు పట్టేస్తాడు.
రొటీన్ ట్రీట్ మెంట్, పండని కామెడీ, రిపీట్ అనిపించే కంటెంట్ తో పరమ్ సుందరి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మలయాళ కుట్టిగా జాన్వీ కపూర్ మంచి నటన కనబరిచినప్పటికీ అదంతా వృథాగా పోయింది. సిద్దార్థ్ మల్హోత్రా రెగ్యులర్ అనిపించే హీరో పాత్రలో అంతకంటే రొటీన్ గా కనిపించాడు. సచిన్ జిగర్ సంగీతం వీలైనంత కాపాడే ప్రయత్నం చేసినా వీక్ కంటెంట్ ముందు వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు. అసలు ఇంత అత్తెసరు కథల మీద నిర్మాతలు కోట్ల పెట్టుబడి ఎలా పెడుతున్నారో అంతు చిక్కదు. బాలీవుడ్ వదిలేసి ఇకపై పెద్ది నుంచి జాన్వీ కపూర్ ఇక్కడే తెలుగులో సెటిలైపోవడం ఉత్తమం.
This post was last modified on August 30, 2025 12:10 pm
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…