Movie News

చివరి ఓవర్లో సిక్సులు కొట్టాల్సిందే

నారా రోహిత్ ని సోలో హీరోగా చూసి చాలా కాలమయ్యింది. అందుకే సుందరకాండ మీద గంపెడాశలు పెట్టుకున్నాడు. లక్కీగా టాక్ పాజిటివ్ గా వచ్చింది. మరీ ఎక్స్ ట్రాడినరి అనలేదు కానీ ఈ మాత్రం బాగుంటుందని కూడా చాలా మంది ఊహించకపోవడంతో చిన్న సర్ప్రైజ్ అనిపించింది. కానీ కలెక్షన్లు పెద్దగా లేకపోవడం విచిత్రం. మాములుగా ఇలాంటి చిన్న సినిమాలకు మౌత్ టాక్ మెల్లగా స్ప్రెడ్ అవుతూ రెండో రోజుకల్లా పికపవుతాయి. ఇది చాలాసార్లు జరిగింది. కానీ సుందరకాండకు అలాంటి సూచనలు కనిపించలేదు. దీంతో టీమ్ వెంటనే రంగంలోకి దిగి సక్సెస్ మీట్ పెట్టి పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లు షురూ చేసింది.

సమస్యల్లా రోహిత్ కు హీరోగా మార్కెట్ ఎప్పుడో డౌన్ అయిపోవడం. అతని టేస్ట్ మీద ఆడియన్స్ కి గౌరవమున్నా అది థియేటర్ కు వెళ్లి టికెట్లు కొనేంత కాదు. అదిరిపోయిందనే మాట వస్తే తప్ప అంత సులభంగా కదలరు. సుందరకాండకు ఇదే ఇబ్బందిగా మారింది. ఈశ్వర్ హీరోయిన్ శ్రీదేవి రీ ఎంట్రీ,  లియోన్ జేమ్స్ సంగీతం, కమెడియన్ సత్య లాంటి ఎలిమెంట్స్ మరీ ఎక్కువ ఆసక్తిని కలిగించలేకపోయాయి. స్టోరీ పాయింట్ కూడా కొంచెం డిఫరెంట్ గా తీసుకోవడం అన్ని వర్గాల ప్రేక్షకులను కనెక్ట్ చేయించడంలో కొంచెం తడబడింది. ఇవన్నీ కొంచెం ప్రతికూలంగా ప్రభావం చూపించిన మాట వాస్తవం.

అందుకే వీకెండ్ ని కీలకంగా భావించిన సుందరకాండ బృందం సక్సెస్ టూర్ తో ఆడియన్స్ ని కలుసుకోబోతోంది. వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి  ఇలా మొత్తం ఏపీ నగరాలను ఒక రౌండ్ వేయబోతోంది. ఇప్పుడు కనక పికప్ అయితే సెప్టెంబర్ 5 ఘాటీ, మదరాసి వచ్చేదాకా మంచి ఛాన్స్ ఉంటుంది. ఈ వారం రిలీజైన వాటిలో మలయాళం డబ్బింగ్ కొత్త లోక కొంచెం డీసెంట్ టాక్ తో మొదలవ్వగా మిగిలినవి ఎదురీదుతున్నాయి. మరి సుందరకాండ చివరి ఓవర్ లాంటి ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటుందో, జనాన్ని ఎలా రాబడుతోందో చూడాలి.

This post was last modified on August 29, 2025 10:27 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Sundarakanda

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

57 minutes ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

4 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

6 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

8 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

9 hours ago