ముందు నుంచి డిసెంబర్ 5 విడుదల అంటూ నొక్కి వక్కాణిస్తూ వచ్చిన ది రాజా సాబ్ ఎట్టకేలకు మళ్లీ మనసు మార్చుకుంది. డేట్ వదులుకున్న సంగతి లీకుల రూపంలో వారం క్రితమే బయటికి వచ్చినప్పటికీ తాజాగా నిర్మాత విశ్వప్రసాద్ దాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. మిరాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ వచ్చే ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 9 ది రాజా సాబ్ రిలీజ్ చేస్తామని మైకులో స్పష్టంగా చెప్పేశారు. ఏదైతే గాసిప్ గా తిరిగిందో అదే నిజమయ్యిందన్న మాట. సో ఈ ఏడాది కన్నప్పలో చేసిన క్యామియో తప్ప ప్రభాస్ ఇంకో సినిమాలో దర్శనమివ్వనట్టే.
మరో గుడ్ న్యూస్ ఏంటంటే ది రాజా సాబ్ నుంచి రెండు ట్రైలర్లు రాబోతున్నాయి. మొదటిది అక్టోబర్ లో తెస్తున్నారు. కాంతార చాప్టర్ 1తో పాటు స్క్రీనింగ్ చేయాలనీ చూస్తున్నారు. అప్పటికంతా ఎడిటింగ్ అయిపోతే బిగ్ స్క్రీన్ మీద చూడొచ్చు. లేదంటే ఇంకొంచెం ఆలస్యమవుతుంది. రిలీజ్ దగ్గరగా ఉన్నప్పుడు డిసెంబర్ లో మరో ట్రైలర్ వదులుతారు. టీజరే అంత లెన్త్ తో వదిలిన దర్శకుడు మారుతీ ఈసారి ఎలాంటి ట్రీట్ ఇస్తాడో చూడాలి. సరే ఇదంతా బాగానే ఉంది కానీ రాజా సాబ్ ఒకేరోజు విజయ్ జన నాయకుడుతో పోటీ పడాల్సి ఉంటుంది. తెలుగులో ఇబ్బంది లేదు కానీ తమిళనాడులో చిక్కు తప్పదు.
బాహుబలి నుంచి ప్రతిసారి సోలోగా వస్తున్న ప్రభాస్ ఈసారి టఫ్ కాంపిటీషన్ చవి చూడాల్సి ఉంటుంది. మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, రవితేజ 77 ఆల్రెడీ కర్చీఫ్ వేసుకుని ఉన్నాయి. వీటిలో ఒకటో రెండో వెనక్కు తగ్గుతాయని అనుకోవడానికి లేదు. పరిస్థితులను బట్టి. నిర్ణయాలు ఎటువైపు తిరుగుతాయో ఇప్పుడే చెప్పలేం. అఖండ డిసెంబర్ లో రాకపోతే అది కూడా ఈ పండగ వైపే చూసే అవకాశాలు కొట్టిపారేయలేం. కాకపోతే రాజా సాబ్ వదులుకున్న తేదీనే తీసుకుందని ఆల్రెడీ లీక్ ఉంది కాబట్టి టెన్షన్ అక్కర్లేదు. ఇక రాజా సాబ్ కు సంబంధించి కీలకమైన డౌట్లు తీరాయి కాబట్టి ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వొచ్చు.
This post was last modified on August 28, 2025 4:40 pm
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్‌కు…
ఎన్నికలు ఏవైనా.. ప్రజలకు 'ఫ్రీ బీస్' ఉండాల్సిందే. అవి స్థానికమా.. అసెంబ్లీనా, పార్లమెంటా? అనే విషయంతో సంబంధం లేకుండా పోయింది.…