హనుమాన్ తర్వాత తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. తన మార్కెట్ ని మించి బడ్జెట్ ఖర్చు పెట్టిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతూ వస్తున్నా క్వాలిటీ కోసం రాజీలేని ధోరణి ప్రదర్శించింది. ఏప్రిల్, ఆగస్ట్ అంటూ ఒకే ఏడాదిలో రెండు మూడు వాయిదాలు వేసుకున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ ఎట్టకేలకు సెప్టెంబర్ 12 థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్సులో ట్రైలర్ లాంచ్ చేశారు. ఓపెనింగ్స్ తేవడానికి ఇది కీలకం కావడంతో అందరి దృష్టి దీని మీదే ఉంది. ఏకంగా మూడు నిమిషాల కంటెంట్ తో సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు.
కథని చెప్పీ చెప్పకుండా కట్ చేశారు. అనగనగా ఒక కుర్రాడు (తేజ సజ్జ). సరదాగా జీవితం గడుపుతూ తోచిన పనులు చేసుకుంటూ ఉంటాడు. ప్రేమించిన అమ్మాయి (రితిక నాయక్) చెప్పేవరకు తన పుట్టుక లోక కళ్యాణం కోసమని తెలుసుకోడు. ప్రపంచాన్ని నాశనం చేయాలని పూనుకున్న ఒక దుర్మార్గుడు (మంచు మనోజ్) ని అడ్డుకునేందుకు ప్రాణాలకు తెగించి ప్రమాదకరమైన ప్రాంతాలకు వెళ్తాడు. ఎన్నో అడ్డంకులు, ఎన్నెన్నో సవాళ్లు. మధ్యలో చేయూత నిచ్చే ఎన్నో శక్తులు. అసలు మిరాయ్ అంటే ఏమిటి, తొమ్మిది గ్రంథాల వెనుక ఉన్న రహస్యం ఏంటనేది ఇంకో రెండు వారాల తర్వాత థియేటర్లలో చూడాలి.
దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని టెక్నికల్ గా తనకున్న పట్టుని మరోసారి చూపించారు. చాలా పెద్ద ప్యాన్ ఇండియా మూవీస్ లో కనిపించే టాప్ క్వాలిటీ ఇప్పుడీ మిరాయ్ లోని ప్రతి ఫ్రేమ్ లో దర్శనమిస్తోంది. మాములు మనుషులు చూడని లోకాలను చూపిస్తూ, అంతుచిక్కని మలుపులతో పాటు చివరిలో శ్రీరాముడి పాత్రను జోడించడం ద్వారా ఎలివేషన్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాడు. యుద్ధం ప్రధానంగా తేజ సజ్జ, మంచు మనోజ్ మధ్యే అయినా బోలెడు సర్ప్రైజ్ ఎలిమెంట్స్ తో కార్తీక్ అంచనాలు పెంచేశాడు. గౌరా హరి బిజిఎం బాగుంది. అసలు కంటెంట్ కూడా ఇలాగే ఉంటే తేజ, కార్తీక్, పీపుల్స్ మీడియాకు బ్లాక్ బస్టర్ దక్కినట్టే.
This post was last modified on August 28, 2025 12:40 pm
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…