ఊహించని అద్భుతం జరిగిపోయింది. కేవలం ఒక రోజు గ్యాప్ తో హరిహర వీరమల్లు లాంటి ప్యాన్ ఇండియా మూవీతో క్లాష్ అయిన యానిమేటెడ్ సినిమాని తక్కువంచనా వేసిన వాళ్ళు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ట్రేడ్ టాక్ ప్రకారం నిన్న ఆదివారంతో మహావతార్ నరసింహ 300 కోట్ల గ్రాస్ క్లబ్బులోకి సగర్వంగా అడుగు పెట్టింది. 2025 టాప్ 4 ప్లేస్ లో ఉన్న హౌస్ ఫుల్ ఫైవ్ ని దాటేందుకు కేవలం నాలుగు కోట్ల దూరంలో ఉంది. ఆ లాంఛనం కూడా ఒకటి రెండు రోజుల్లో అయిపోతుంది. ఒకవేళ ఈ జోరుని ఇంకొంచెం హోల్డ్ చేసి నడుచుకుంటే ఏకంగా వార్ 2ని దాటేయొచ్చు. కొట్టిపారేయలేం.
ఓవర్సీస్ లో సుమారు 26 కోట్లకు పైగా రాబట్టిన మహావతార్ నరసింహ ఇండియా వైడ్ కలిపి 274 కోట్లను దాటేసింది. ఇవి చాలా మంది టయర్ 2 స్టార్ హీరోలకు సైతం సాధ్యం కాని నెంబర్లు. కొత్త సినిమాలు ఎన్ని రిలీజవుతున్నా ఇంత బలంగా నిలబడిన చిత్రం ఈ మధ్య కాలంలో ఇదొక్కటేనని చెప్పాలి. అందులోనూ వందల కోట్లతో రూపొందిన స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిస్తే ఈ యానిమేటెడ్ మూవీ మాత్రం ప్రతి వీకెండ్ లో హౌస్ ఫుల్స్ నమోదు చేయడం గమనార్హం. ఇప్పటికైతే జోరు తగ్గింది కానీ సెప్టెంబర్ 5 దాకా థియేటర్లలో కొనసాగడం ఖాయం. ఫైనల్ రన్ అక్కడితో దగ్గర పడొచ్చు.
శ్రీవిష్ణు అవతారమైన నరసింహుడి ఉగ్రరూపాన్ని తెరమీద చూసేందుకు పిల్లా పెద్దా థియేటర్లకు క్యూ కట్టడం మహావతార్ నరసింహ స్థాయిని అమాంతం పెంచేసింది. ముంబై రిపోర్ట్స్ ప్రకారం మహావతార్ కు పెట్టిన బడ్జెట్ కేవలం 15 కోట్లు. అంతే ఇప్పటిదాకా వచ్చిన రెవిన్యూని చూసుకుంటే 1451 శాతం లాభాలతో కనకవర్షం కురిపించింది. అసలు ఆర్టిస్టులే లేకుండా ఒక బొమ్మల సినిమా ఇంత మేజిక్ చేయడం నిజంగా విచిత్రం. భవిష్యత్తులో దీన్ని ఎవరైనా బద్దలు కొట్టడం అంత సులభంగా ఉండదు. మూడు వందల కోట్లు దాటిన ఒక ఒక ఇండియన్ యానిమేటెడ్ మూవీగా మహావతార్ నరసింహకు పెద్ద రికార్డు దక్కింది.
This post was last modified on August 28, 2025 10:40 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…