Movie News

రూమర్లకు తెర.. హీరోయిన్ పెళ్లికి రెడీ

నివేథా పెతురాజ్.. తెలుగు వారికి కూడా బాగానే పరిచయమున్న తమిళ నటి. ఆమె తెలుగులో మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, రెడ్, అల వైకుంఠపురములో, పాగల్, విరాట పర్వం.. ఇలా చాలా సినిమాలే చేసింది. తమిళంలో కూడా కొన్ని క్రేజీ చిత్రాల్లో నటించింది నివేథా. ఐతే తన సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది నివేథా. ప్రస్తుతం తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి ఆమె పేరు తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది. వీళ్లిద్దరూ కలిసి ఒకే ఒక్క సినిమాలో నటించారు. అది కూడా ఫ్లాప్ మూవీ.

కెరీర్ ఆరంభంలో ఉదయనిధితో కలిసి నటించిన నివేథా మళ్లీ అతడితో జట్టు కట్టలేదు. కానీ ఆల్రెడీ పెళ్లయిన ఉదయనిధికి నివేథాతో సంబంధం ఉన్నట్లు ఎన్నో ఏళ్ల నుంచి కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. యూట్యూబ్ ఛానెళ్లలో వీరి గురించి రకరకాల కథనాలు వస్తుంటాయి. ఉదయనిధి కోసం నివేథా పెళ్లి కూడా మానుకుందని.. ఆమె కోసం దుబాయ్‌లో ఉదయనిధి లగ్జరీ ఫ్లాట్ కొన్నాడని.. అక్కడే ఆమెను తరచూ కలుస్తుంటాడని.. ఇలా రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.

ఐతే ఈ ప్రచారాలన్నింటికీ తెరదించుతూ ఒక అప్‌డేట్ ఇచ్చింది నివేథా. త్వరలోనే తన పెళ్లి జరగబోతున్న విషయాన్ని నివేథా వెల్లడించింది. రజిత్ ఇబ్రాన్ అనే వ్యాపారవేత్తను ఆమె పెళ్లాడబోతోంది. తనతో నిశ్చితార్థం అయిన విషయాన్ని నివేథా అధికారికంగా ప్రకటించింది. ఎంగేజ్మెంట్ ఫొటోను కూడా సోషల్ మీడియాలో నివేథా పంచుకుంది. రజిత్ ఒక వ్యాపారవేత్త అట. అతడికి వివిధ దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయట. వీళ్లిద్దరూ ఫారిన్లోనే సెటిల్ కాబోతున్నట్లు సమాచారం. నివేథా స్వయంగా ఎంగేజ్మెంట్ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఊహాగానాలకు ఇంతటితో తెరపడ్డట్లే.

This post was last modified on August 28, 2025 8:08 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago