తమిళంలో మంచి పేరున్న హీరోయిన్లలో ఒకరైన లక్ష్మీ మీనన్ విచిత్రమైన వివాదంతో వార్తల్లో నిలిచింది. ఆమెపై కేరళలోని కొచ్చిలో కిడ్నాప్ కేసు నమోదు కావడం గమనార్హం. అంతేకాక ఆమె పరారీలో ఉంది. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆమె కిడ్నాప్ చేసి హింసించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇంతకీ ఏం జరగిందంటే..?
కొచ్చిలో ఇటీవల ఒక బార్ దగ్గర లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులకు.. ఒక ఐటీ ఉద్యోగి బృందంతో గొడవ జరిగింది. ఐతే ఆ గొడవ కాస్త సద్దుమణిగాక కూడా లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులు ఊరుకోలేదు. పంతం పట్టి ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తమ వాహనంతో వెంబడించారు. ఆ వ్యక్తిని ఒక చోట పట్టుకుని కారులోకి బలవంతంగా ఎక్కించారు. లోపల అతడిపై తీవ్రంగా దాడి చేశారు. దీంతో ఆ ఉద్యోగి తనను కిడ్నాప్ చేసి దాడి చేశారంటూ లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులపై కేసు పెట్టాడు. ఐతే పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్తే లక్ష్మి వారి చేతికి చిక్కలేదు. ఆమె పరారీలో ఉందని పోలీసులు తెలిపారు. ఆమె కోసం గాలింపు చేపడుతున్నట్లు వెల్లడించారు.
లక్ష్మి మీనన్ చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగు పెట్టింది. తమిళంలో ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టిన ‘కుంకి’ (తెలుగులో గజరాజు)లో నటించే సమయానికి ఆమె వయసు 19 ఏళ్లే. కోలీవుడ్లో ఇంకా పాండియనాడు, నాన్ సిగప్పు మనిదన్, జిగర్ తండా లాంటి సూపర్ హిట్ సినిమాల్లో ఆమె నటించింది. మాతృ భాష మలయాళమే అయినా ఆమెకు తమిళంలోనే మంచి పేరు వచ్చింది. డబ్బింగ్ సినిమాలతో లక్ష్మికి తెలుగులోనూ మంచి గుర్తింపే లభించింది. ఈ మధ్య ఆమెకు కాస్త సినిమాలు తగ్గాయి. ఇలాంటి టైంలో ఈ వివాదంతో వార్తల్లోకి వచ్చింది.
This post was last modified on August 28, 2025 8:05 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…