Movie News

కుబేర తర్వాత… కమ్ముల మళ్లీ

కొందరు దర్శకులకు కొన్ని బేనర్లతో బాగా సింక్ కుదురుతుంది. గత చిత్రాల ప్రొడక్షన్ విషయంలో ఇబ్బందులు తలెత్తి ఉండొచ్చు లేదంటే కొత్త నిర్మాతలతో కంఫర్ట్ ఉండొచ్చు. కారణమేదైనా వరుసగా ఒక బేనర్లో సినిమాలు చేస్తుంటారు. నిర్మాణ సంస్థలు కూడా తమకంటూ ఆస్థాన దర్శకులు ఉండాలని కోరుకుంటాయి. దిల్ రాజు బేనర్లో ఇలా వరుసగా సినిమాలు చేసిన దర్శకులు చాలామందే ఉన్నారు. హారిక హాసిని సంస్థ ఎన్నో ఏళ్ల నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్‌తోనే సినిమాలు తీస్తోంది. త్రివిక్రమ్ కూడా బయటి బేనర్లకు సినిమాలే చేయట్లేదు. 

ఈ కోవలోనే శేఖర్ కమ్ముల కూడా ఒక సంస్థతో ట్రావెల్ చేస్తున్నాడు. అదే.. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్‌పీ. ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు కలిసి నడిపిస్తున్న సంస్థ. ఈ బేనర్లో కమ్ముల ఇప్పటికే రెండు సినిమాలు చేశాడు. తొలిసారి ఆ బేనర్లో చేసిన ‘లవ్ స్టోరి’ ఓ మోస్తరు ఫలితాన్నందుకోగా.. రెండో చిత్రం ‘కుబేర’ తెలుగు వరకు మంచి విజయాన్నే అందుకుంది. దీంతో మరోసారి ఈ నిర్మాణ సంస్థలో కమ్ముల సినిమా చేయబోతున్నాడు. 

వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకుని కమ్ములతో తమ బేనర్లో మరో సినిమా చేయబోతున్న విషయాన్ని ఆ సంస్థ ప్రకటించింది. ఐతే ఇంతకుమించి సినిమా గురించి వివరాలేమీ వెల్లడించలేదు. ఈ ప్రాజెక్టు ఆరంభ దశలోనే ఉందని, కాస్ట్ అండ్ క్రూ గురించి తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. కమ్ముల స్క్రిప్టు రెడీ చేయడానికి, ప్రి ప్రొడక్షన్‌కు చాలా టైం తీసుకుంటాడు. కాబట్టి వచ్చే ఏడాదే ఈ సినిమా మొదలయ్యే అవకాశముంది. ఈసారి తన మార్కు ప్రేమకథా చిత్రం తీస్తానని ‘కుబేర’ ప్రమోషన్ల టైంలో కమ్ముల వెల్లడించిన సంగతి తెలిసిందే.

This post was last modified on August 28, 2025 8:11 am

Share

Recent Posts

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

1 hour ago

వైష్ణవి చైతన్య బాధ వర్ణనాతీతం

యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…

2 hours ago

మండాడి ఊపులో దేవర ఊసులు

తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…

2 hours ago

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

5 hours ago

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

6 hours ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

6 hours ago