చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా నారా రోహిత్ చేసిన సినిమా సుందరకాండ. నిజానికిది ఏడాది క్రితమే విడుదల కావాల్సింది. రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వినాయక చవితి పండక్కు మోక్షం దక్కించుకుంది. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో హైదరాబాద్ లో ముందు రోజే ప్రీమియర్లు వేయడం టాక్ పరంగా పనికొచ్చింది. చూసినవాళ్లు బాగుందని, మంచి ప్రయత్నమని మెచ్చుకోవడం సోషల్ మీడియాలో కనిపించింది. మరీ హిలేరియస్ కాదు కానీ ఉన్నంతలో నవ్వించడానికి టీమ్ పెట్టిన ఎఫర్ట్ సక్సెసయ్యిందని మెచ్చుకున్నారు. భైరవం కన్నా బెటర్ రివ్యూలు సుందరకాండకు కనిపించాయి.
కానీ రోహిత్ ఆనందానికి వర్షం బ్రేక్ వేస్తోంది. తెలంగాణలో వర్షాలు భీకరంగా పడుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి నుంచి ఆదిలాబాద్ తదితర ప్రాంతాల వైపు వాతావరణం వరదని మించి ఉంటోంది. హైదరాబాద్ తో పాటు ఇతర నగరాలకు రెడ్ అలెర్ట్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో జనాలు థియేటర్ కు రావడం అంత సులభంగా ఉండదు. పైగా రోహిత్ కు మంచి టేస్ట్ ఉందనే అభిప్రాయం జనంలో ఉన్నా తనేమి ఓపెనింగ్స్ తీసుకొచ్చే క్రౌడ్ పుల్లర్ కాదు. బాగుందనే మాట మెల్లగా పాకితే జనం రావడం మొదలు పెడతారు. కానీ ఇప్పుడొచ్చిన డీసెంట్ టాక్ కలెక్షన్లుగా మారాలంటే వర్షాలు తెరిపినివ్వాలి.
ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు పడుతున్నాయి. వినాయక మండపాలు సైతం ఇబ్బందులు పడుతున్న వైనం టీవీలో చూస్తున్నాం. పండగ ప్లస్ లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందనే ఉద్దేశంతో బిజినెస్ మీద చాలా ఆశలు పెట్టుకున్న సుందరకాండ బృందానికి వర్షాలు షాక్ ఇస్తున్నాయి. రేపో ఎల్లుండో తగ్గితే శని ఆదివారాలు మెరుగైన ఆక్యుపెన్సీలు చూడొచ్చు. ప్రేమకథల్లో ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని పాయింట్ తీసుకున్న దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి మొదటి ప్రయత్నంలో మంచి ప్రశంసలే అందుకున్నాడు. మరి అవి వసూళ్లుగా మారతాయో లేదో సోమవారానికి క్లారిటీ వచ్చేస్తుంది. చూద్దాం.
This post was last modified on August 27, 2025 9:11 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…