పెద్ది విడుదల ఇంకా చాలా దూరంలో ఉంది కానీ అభిమానుల ఎదురు చూపులు మాత్రం మాములుగా లేవు. ముఖ్యంగా గేమ్ ఛేంజర్ చేసిన గాయం చిన్నది కాకపోవడంతో ఎప్పుడెప్పుడు విమర్శకులకు సమాధానం చెప్పాలాని వెయిట్ చేస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సినిమాని తీర్చిదిద్దుతున్న విధానం గురించి ఇప్పటికే రకరకాల వార్తలు బయటికి వచ్చి వాళ్ళ ఎగ్జైట్ మెంట్ ని అమాంతం పెంచుతున్నాయి. రంగస్థలం టెన్ ఎక్స్ రేంజులో ఉంటుందని తెగ ఊరింపులు వినిపిస్తున్నాయి. అయితే రామ్ చరణ్ కు సంబంధించిన ఒక ముఖ్యమైన లీకు మాత్రం అంచనాలు మరింత పెంచేలా ఉంది.
వాటి ప్రకారం చరణ్ ఇందులో రెండు షేడ్స్ లో కనిపించబోతున్నాడు. వయసు రీత్యా పరస్పరం పూర్తి విరుద్ధంగా ఉంటాయట. అంటే డ్యూయల్ రోల్ అన్న మాట. గేమ్ ఛేంజర్ లో ఆల్రెడీ తండ్రి కొడుకులుగా నటించిన చరణ్ దాని రూపంలో చేదు ఫలితం అందుకున్నాడు. కానీ ఆ సినిమాలో ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు చరణ్ లు కనిపించలేదు. నాయక్ లో వివి వినాయక్ కవల చరణ్ కాంబో సీన్లు బోలెడు పెట్టి ఖుషి చేశాడు. మరి పెద్దిలో బుచ్చిబాబు ఎలాంటి ఫీస్ట్ ఇవ్వబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్. డ్యూయల్ రోల్ అయినా కాకపోయినా రెండు రూపాల్లో రామ్ చరణ్ విశ్వరూపం ఉంటుందని ఇన్ సైడ్ టాక్.
మార్చి 27 విడుదలకు రెడీ అవుతున్న పెద్దికి ఎలాంటి ఆలస్యం జరగడం లేదు. తాజాగా జరుగుతున్న షెడ్యూల్ లో కీలకమైన ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు. దీనికోసమే గెడ్డం మరింత గుబురుగా పెంచి హెయిర్ స్టైల్ మార్చాడనే కామెంట్స్ అంతర్గతంగా వినిపిస్తున్నాయి. డిసెంబర్ కంతా షూట్ పూర్తి చేసి జనవరి నుంచి పూర్తి ప్రమోషన్ల మీద దృష్టి పెట్టేలా బుచ్చిబాబు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఉప్పెన చూసి తన మీద ఇంత నమ్మకాన్ని పెట్టుకున్న చరణ్ కి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే కసితో ఉన్నాడు బుచ్చిబాబు. బిజినెస్ కు సంబంధించి నిర్మాతకు క్రేజీ ఆఫర్లు వస్తున్నా ఇంకా ఎవరి దగ్గరా అడ్వాన్స్ తీసుకోలేదట.
This post was last modified on August 27, 2025 6:42 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…