కల్కి 2898 ఏడి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ చేయబోయే సినిమా దాని సీక్వెలే అని నిన్నా మొన్నటి దాకా ఉన్న ప్రచారం. అయితే ప్రభాస్ ఇప్పుడప్పుడే అందుబాటులోకి వచ్చేలా లేకపోవడంతో పార్ట్ 2 మరింత ఆలస్యం అవుతుందనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. నిర్మాత అశ్వినిదత్ వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని చూస్తున్నారు కానీ వరస ప్రాజెక్టులతో లాకైపోయిన ప్రభాస్ ఇప్పుడప్పుడే డేట్లు ఇచ్చే పరిస్థితిలో లేడు. స్క్రిప్ట్ అయితే సిద్ధంగా ఉందని, డార్లింగ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం ఆలస్యం ప్రీ ప్రొడక్షన్ మొదలుపెట్టేలా ఏర్పాట్లు జరిగి పోయాయట. కానీ వెయిటింగ్ కొనసాగుతోంది.
ఇటీవలే రజనీకాంత్ కు నాగ్ అశ్విన్ ఒక లైన్ చెప్పాడని, ఆయన సానుకూలంగా స్పందించారనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో తిరుగుతోంది. ఇంకా నిర్ధారణ కాకపోయినా\ గాసిప్ గట్టిగానే ఉంది. గతంలో బాబీ లాంటి దర్శకులు రజనిని లైన్ తో మెప్పించినా ఫుల్ వెర్షన్ తో ఓకే చేయించుకోలేకపోయారు. సో నాగ్ అశ్విన్ కు కూడా అంత తేలిక కాదు. గత ఏడాది ఏవిఎం సంస్థతో కొలాబరేషన్ ప్రకటించిన నాగ్ అశ్విన్ అది దేని గురించో ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వలేదు. తన స్వీయ దర్శకత్వమా లేక నిర్మాణ భాగస్వామినా అనేది చెప్పలేదు. ఆ మధ్య ఓసారి అలియా భట్ ని కలిశాడనే టాక్ కూడా ముంబై మీడియాలో ఉంది.
ఇదంతా చూస్తుంటే నాగ్ అశ్విన్ సస్పెన్స్ ఇంకొంత కాలం కొనసాగేలా ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి 2 కోసం డిమాండ్ చేస్తున్నా దానికి ఎదురు చూపులు తప్పేలా లేవు. ఇప్పటిదాకా చేసింది మూడు సినిమాలే అయినా పరుగులు పెట్టకుండా నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తున్న ఈ క్రియేటివ్ దర్శకుడు వీలైనంత త్వరగా కొత్త సినిమా మొదలుపెట్టాలి. సమస్యల్లా కల్కిని మించిన కాంబోని ఆశిస్తారు కాబట్టి దాన్ని అందుకోవడమే పెద్ద సవాల్. ప్రస్తుతానికి పజిల్ లాంటి ప్రశ్నలైతే మిగిలాయి కానీ సమాధానాలకు మాత్రం టైం పడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు.
This post was last modified on August 26, 2025 11:51 am
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…