ఇప్పుడు సౌత్ ఇండియా అంతటా సోషల్ మీడియాలో హీరోల అభిమానుల మధ్య అసహ్యం కలిగించే రీతిలో ఫ్యాన్ వార్స్ నడుస్తున్నాయంటే.. అందులో మేజర్ క్రెడిట్ తమిళ సూపర్ స్టార్లు విజయ్, అజిత్‌ల అభిమానుల పుణ్యమే. సోషల్ మీడియాలో సినీ అభిమానుల్లో కనిపించే సకల అవలక్షణాలూ వీళ్ల నుంచి మొదలైనవే. యూట్యూబ్‌లో వ్యూస్, లైక్స్ విషయంలో రికార్డుల పిచ్చికి తెర తీసింది వీళ్లే. ఇక్కడి నుంచే మిగతా వాళ్లకు పాకింది.
ట్విట్టర్లో సమయం సందర్భం లేకుండా హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం.. టార్గెట్లు పెట్టి ట్వీట్లు వేయడం.. అవతలి హీరో మీద నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి దారుణమైన రీతిలో ట్రోలింగ్ చేయడం.. జుగుప్సాకరమైన రీతిలో మీమ్స్ వేయడం.. ఇలాంటి అవలక్షణాల్ని మిగతా ఇండస్ట్రీల అభిమానులకు అలవాటు చేసిన పుణ్యం వాళ్లకే దక్కుతుంది. వేరే రోజుల్లో అయినా పర్వాలేదు.. ఒక హీరో పుట్టిన రోజు వస్తే.. మరో హీరో ఫ్యాన్స్ నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ పెట్టడం.. లేదా అవతలి హీరో వాల్యూ తగ్గించేలా ఇంకేదైనా ప్లాన్ చేయడం.. ఇలాంటివి విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య సర్వ సాధారణం.
గత ఏడాది జూన్ 22న విజయ్ పుట్టిన రోజు నాడు అజిత్ అభిమానులు ఇలాగే చేశారు. ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ అందుకున్నారు. మే 1న అజిత్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అజిత్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్ పెట్టి నేషనల్ లెవెల్లో ట్రెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అతడి అభిమానులు. మరి విజయ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఊరుకోలేదు. ‘విజయ్ ది ఫేస్ ఆఫ్ కోలీవుడ్’ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి హంగామా మొదలుపెట్టారు.
దెబ్బకు అజిత్ హ్యాష్ ట్యాగ్ కిందికి వెళ్లిపోయింది. విజయ్ మీదే ఎక్కువ ట్వీట్లు పడుతున్నాయి. అతడి మీద పెట్టిన హ్యాష్ ట్యాగే జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది. ఒక టార్గెట్ పెట్టుకుని ఉద్యమం లాగా ట్వీట్లు వేస్తూ అజిత్ పుట్టిన రోజు నాడు విజయ్ ఆధిపత్యాన్ని చాటుతున్నారు అతడి ఫ్యాన్స్. ఈ పనికి మాలిన పనులు చూసి మన హీరోల ఫ్యాన్స్ బాగానే ఇన్‌స్పైర్ అవుతున్నారని ఇటీవలి వ్యవహారాల్ని చూస్తే స్పష్టంగా తెలుస్తోంది.
This post was last modified on May 1, 2020 2:33 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…