శ్రీలీల హిందీ డెబ్యూ ఎవరితో

తెలుగులో టాప్ మోస్ట్ డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న శ్రీలీల త్వరలో పరాశక్తితో తమిళంలో అడుగు పెట్టనుంది. కన్నడలో జూనియర్ ద్వారా ఆ లాంఛనం అయిపోవడంతో నెక్స్ట్ టార్గెట్ హిందీ కానుంది. తను అక్కడ రెండు సినిమాలు చేసింది. వాటిలో మొదటిది ఇబ్రహీం అలీ ఖాన్ సరసన చేసిన డైలర్. అయితే షూటింగ్ ఏ దశలో ఉందనేది ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్ లేదు. స్త్రీ లాంటి బ్లాక్ బస్టర్స్ నిర్మించిన మాడాక్ ఫిలిమ్స్ దీనికి నిర్మాత. ట్విస్ట్ ఏంటంటే డైలర్ ని నేరుగా ఓటిటి రిలీజ్ చేయాలనే ఆలోచనలో నిర్మాణ సంస్థ ఉందని ముంబై టాక్. అధికారిక ప్రకటన రాలేదు కానీ టాక్స్ బలంగా ఉన్నాయి.

డైలర్ కన్నా ఎక్కువగా శ్రీలీల ఆశలు కార్తీక్ ఆర్యన్ తో చేస్తున్న సినిమా మీదున్నాయి. ఆషీకీ 3గా ప్రచారంలో ఉన్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో మంచి పాటలు, సైయారా స్థాయిలో రొమాన్స్, యూత్ ని ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయని వినికిడి. ఇది థియేటర్ రిలీజ్ అవుతుంది. దీంతో తనకు పెద్ద బ్రేక్ దక్కుతుందనే నమ్మకం శ్రీలీలలో ఉంది. కార్తీక్ ఆర్యన్ తో తన స్నేహం గురించి ముంబై మీడియాలో ఏవేవో ప్రచారాలు జరిగినా వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తోంది. కాంబినేషన్ క్రేజ్ దృష్ట్యా అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న ఆషీకీ 3 మీద పెద్ద ఎత్తున బిజినెస్ జరగొచ్చని ఒక అంచనా.

సో ప్రాక్టికల్ గా చూస్తే కార్తీక్ ఆర్యన్ తో చేసిన సినిమానే ముందు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తెలుగు విషయానికి వస్తే ధమాకా కాంబో రిపీట్ చేస్తూ రవితేజతో చేసిన మాస్ జాతర రెడీగా ఉంది. ఆగస్ట్ నుంచి వాయిదా వేసుకున్నాక కొత్త డేట్ ఇంకా ప్రకటించలేదు. ఏకంగా అక్టోబర్ కు వెళ్లిపోవచ్చనే ప్రచారం మొదలయ్యింది. పవన్ కళ్యాణ్ తో మొదటిసారి జట్టు కట్టిన ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ త్వరగా పూర్తయినా రిలీజ్ వచ్చే ఏడాది వేసవిలో ఉంటుంది. పరాశక్తి ఒకవేళ సంక్రాంతి బరిలో దిగితే మంచి రసవత్తరమైన పోటీ ఉంది. ప్రొడక్షన్ హౌస్ విడుదలకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.