నాలో ఒక బాలు ఒక ఘంటసాల వున్నారు

నేను సాంగ్ రికార్డింగ్ కోసం మద్రాస్ వెళ్లాను.. నాయనమ్మ సినిమా కోసం.. హోటల్ పామ్ గ్రోవ్ లో దిగాను.. కంపోజిన్గ్ అయ్యాక మ్యూజిక్ డైరక్టర్ కోటి ‘ఒక పాట సామవేదం షణ్ముఖ శర్మ అని ఒక కొత్త రైటర్ ఆయన కిద్దాం.. మొన్ననే మోహన్ బాబు గారి సినిమాలో కూడా రాసాడు.. బాగారాస్తున్నాడు’ అని చేప్పాడు..

జనరల్ గా మ్యూజిక్ డైరక్టర్ రికమండ్ చెస్తే పాట బాగా రావడం కోసమే చేస్తారు తప్ప ఒక వ్యక్తిని మన మీద రుద్దే ప్రయత్నం ఉండదు అని నాకు తెలుసు.. వెంటనే ఓకే అన్నాను.. ఆయన వచ్చారు.. ట్యూన్ వినిపించడం జరిగింది . ఆ పాట సందర్భం చెప్పి ‘నాకు పాత్రల ఔచిత్యం దెబ్బతినకుండా మంచి పదాలతో రాయండి’ అని చెప్పాను..

ఆయన చాలా సంతోషం గా ‘అలాగేనండీ.. తప్పకుండా మిమ్మల్ని సంతృప్తి పడేలా రాస్తాను.. ఒక రెండురోజులు సమయం ఇవ్వండి’ అని అడిగారు.. ‘అలాగే మీకు నచ్చేంతవరకు పాట బాగారావడానికి మూడు రోజులు తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు’ అని చెప్పాను.. ఆయన హ్యాపీ గా వెళ్లారు..మూడోవ రోజు ఉదయం ఫోన్ చేసారు.. పాట రెడీ అయ్యింది ఎక్కడకు రమ్మంటారు అని.. నేను పామ్ గ్రోవ్ హోటల్ వున్నాను.. నేను రెడీ గానే వున్నాను మీరు ఎప్పుడైనా రావొచ్చు అని చెప్పాను.. 10గంటలకు హోటల్ కి వచ్చి రిసెప్షన్ నుంచి ఫోన్ చేశారు.. రూమ్ కి రమ్మన్నాను..రూంలో రెండు పెద్ద పెద్ద కాట్స్.. ఒక మంచం మీద నేను కూర్చుని రెండో మంచం మీద ఆయనను కూర్చోమన్నాను.. వొద్దులెండి అని నా ఎదురుగా వున్న సింగిల్ సోఫా లో కూర్చుని లిరిక్ పేపర్ నాకు ఇచ్చారు.. నేను చదివి ‘బాగుందండీ.. ఒకసారి ట్యూన్ లో మీరు పాడండి’ అన్నా.. ఆయన కొంచం ఇబ్బంది గా ‘నేను అంత గొప్పగా పాడలేను’ అన్నారు..
‘పర్వాలేదు.. మీరు మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ట్యూన్ కే గా రాశారు.. లిరిక్ బాగుంది.. మీరు ట్యూన్ లో పాడితే నేను జడ్జ్ చేయగలను అన్నా’.. ఆయన గొంతు సవరించుకుని పాడారు.. పాడిన వెంటనే నేను చప్పట్లు కొడుతూ ‘ఇక మీద నా సినిమాలన్నిటిలోను మీరు ఖచ్చతంగా ఒక పాట రాస్తున్నారు’.. ఆయన చాలా సంతోషించి ‘అంతా ఈశ్వరేచ్ఛ’ అన్నారు.. అప్పుడు నేను చెప్పాను.. ‘మీరు పాట బాగా రాశారు.. దానిలో ఏమాత్రం డౌట్ లేదు.. కానీ మీకు పాట ఇస్తానన్నాడు లిరిక్ బాగా రాసినందుకు కాదు’.. అన్నా.. ‘మరి’ అన్నారు ఆశర్యంగా.’ మీరు పాడినందుకు’ అన్నాను.. అయోమయంగా వున్నారు.. అప్పుడు నేను చెప్పాను..

‘గురువు గారూ.. నేను ఖాళీగా ఉన్నప్పుడో.. స్నానం చేస్తున్నప్పుడో ఎదో ఒక పాట పాడుకుంటూ వుంటాను.. అప్పుడు శివవనాగేశ్వరావ్ లోనుంచి ఇంకోడు బయటకు వచ్చి గట్టిగా అరుస్తాడు.. ఒరేయ్.. అపరా.. అని వెంటనే పాడటం ఆపేస్తాను.. అప్పుడు బయటవున్నవాడు మళ్ళీ భేతాళుడిలాగా మౌనంగా లోపలి వెళ్ళిపోతాడు.. కానీ గురువుగారు.. మీరు పాడాక నాలో ఒక ఘంటసాల ఒక బాలు ఉన్నట్టు అనిపించింది’.. అని ఆయన వైపు చూసాను.. ముఖం చిన్నబోయింది.. వెంటనే నేను అన్నదాంట్లో తప్పు అర్ధమైంది.. సారీ.. ఏమీ అనుకోవద్దు అని బ్రతిమాలను.. లేదు మీరు చాలా నిజాయితీ గా చెప్పారు.. కల్మషం లేని వ్యక్తులే ఇలా చెబుతారు.. అని నన్ను కన్విన్స్ చేశారు.. ఇప్పటికీ ఆయన tv లో ప్రవచనాలు చెబుతున్నప్పుడు నాకీసంఘటన గుర్తొస్తుంటుంది….

— శివ నాగేశ్వర రావు