Movie News

ఇంటా బయటా బాలయ్య ‘అన్‏స్టాపబుల్’

నిన్న లండన్ కు చెందిన వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ లో బాలకృష్ణకు చోటు దక్కడం పట్ల శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. రాజకీయ సినిమా వర్గాల నుంచి అభినందనలు నాన్ స్టాప్ గా దక్కుతున్నాయి. దశాబ్దంన్నరకు పైగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మెన్ గా సేవలు అందించడంతో పాటు హిందూపూర్ ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు గెలుపొంది, సామాజికంగా సినిమాల పరంగా ఎంతో సేవ చేసినందుకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేశారు. గత మూడేళ్లుగా బాలయ్య ట్రాక్ రికార్డు ఇంటా బయటా మాములుగా లేదు. అఖండ ముందు ఉన్న మార్కెట్ కి ఇప్పుడు చూస్తున్న ఎక్స్ ప్రెస్ స్పీడ్ కి పొంతన లేదు.

అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ వరస బ్లాక్ బస్టర్లతో ఒక్కసారిగా వేగం పెంచేసిన బాలయ్య అన్‏స్టాపబుల్ కొత్త సీజన్ ని సక్సెస్ ఫుల్ గా నడిపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే పద్మభూషణ్ ని ఈ ఏడాదే అందుకున్నారు. 50 సంవత్సరాల సుదీర్ఘ నట ప్రస్థానాన్ని ఎంజాయ్ చేస్తూ స్వర్ణోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం అభిమానులు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. ఇంకోవైపు ప్రముఖ బ్రాండ్లకు సెలబ్రిటీగా మారిన బాలయ్య వాటి తాలూకు యాడ్స్ లోనూ మెరిసిపోతున్నారు. గతంలో ఏమో కానీ ఇప్పుడు మాత్రం జై బాలయ్య నినాదం ఎమోషన్ గా మారిపోయింది.

అఖండ 2 నుంచి ఇది మరింత పీక్స్ కు చేరుకుంటుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ముందస్తు రిపోర్ట్స్ చాలా పాజిటివ్ గా ఉన్న నేపథ్యంలో దీని మీద మాములు అంచనాలు లేవు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే సినిమా అతి త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఆదిత్య 999 మ్యాక్స్ ని క్రిష్ డైరెక్షన్ లో ఈ ఏడాదే మొదలుపెట్టే ప్రణాళికలో ఉన్నారు. మోక్షజ్ఞ డెబ్యూ కోసం సరైన కథ గురించి ఎదురు చూస్తున్న బాలయ్య ఆ లాంఛనాన్ని వచ్చే ఏడాది పూర్తి చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మొత్తానికి టాక్ షో టైటిల్ కి సార్ధకం చేకూరుస్తూ బాలయ్య బయట కూడా అన్‏స్టాపబుల్ అనిపిస్తున్నారు.

This post was last modified on August 25, 2025 12:17 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Balakrishna

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

36 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

42 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago