గత కొన్నేళ్లలో ఇండియన్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. మహావతార నరసింహానే. ఇండియాలో పెద్దగా పాపులర్ కాని యానిమేషన్ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని స్థాయిలో వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా రిలీజ్ కాకముందు వరకు ఇండియాలో ఓ యానిమేషన్ చిత్రం రాబట్టిన అత్యధిక వసూళ్లు రూ.56 కోట్లు మాత్రమే. అలాంటిది ఈ సినిమా దాని మీద ఐదారు రెట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళ్లడం అంటే మాటలు కాదు. ముందు వంద కోట్ల వసూళ్లు మైలురాయిని దాటేసరికే ఔరా అనుకున్నారు. కానీ తర్వాత 200 కోట్ల మైలురాయిని కూడా అందుకుని ఆశ్చర్యపరిచింది.
అప్పటికే సినిమా రిలీజై మూడు వారాలు దాటిపోవడంతో ఇంతకుమించి లాంగ్ రన్ ఉండదు అనుకున్నారు. పైగా ఇండిపెండెన్స్ డే వీకెండ్లో వార్-2, కూలీ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కావడంతో మహావతార నరసింహ రన్ ముగిసినట్లే అనుకున్నారు. కానీ ఆ వీకెండ్లో ఆ చిత్రానికి థియేటర్లు తగ్ఆయి కానీ.. ఆ రెండు చిత్రాలూ అనుకున్నుంత బాగా ఆడకపోవడంతో మళ్లీ ఈ యానిమేషన్ మూవీ బ్యాటింగ్ మొదలుపెట్టింది. తిరిగి ఈ చిత్రానికి స్క్రీన్లు, షోలు పెంచారు. నాలుగో వీకెండ్లో కూడా ఈ చిత్రం మంచి ఆక్యుపెన్సీలతో నడుస్తోంది.
ఆల్రెడీ రూ.250 కోట్ల మైలురాయిని దాటేసిన ఈ సినిమా అసాధ్యం అనుకున్న రూ.300 కోట్ల మైలురాయిని కూడా సుసాధ్యం చేసే దిశగా సాగుతోంది. ఈ వీకెండ్ అన్ని షోలూ అయ్యేసరికి ఈ మైల్‌స్టోన్‌కు అత్యంత చేరువగా వచ్చేలా ఉంది మహావతార నరసింహ. సోమవారం లేదా మంగళవారం ఆ మైలురాయిని కూడా టచ్ చేసే అవకాశముంది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఒక రీజనల్ యానిమేషన్ మూవీ ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టించడం అసామాన్యం. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే రూ.170 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది ఇప్పటిదాకా. తెలుగులో కూడా ఈ సినిమా ఫుల్ రన్లో రూ.50 కోట్ల మేర వసూళ్లు సాధించేలా కనిపిస్తోంది. ఆదివారం కూడా ఈ సినిమాకు ఫస్ట్, సెకండ్ షోలు ఫుల్స్ పడుతున్నాయి.
This post was last modified on August 24, 2025 9:53 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…