Movie News

సుందరకాండకు సూపర్ ఛాన్స్… వాడుకుంటుందా

విభిన్న కథలను ఎంచుకుంటాడని పేరున్న నారా రోహిత్ ఆ మధ్య చాలా గ్యాప్ తీసుకున్నాడు. హీరోగా పెద్గ మార్కెట్ లేకపోయినా తన టేస్ట్ మీద నమ్మకంతో థియేటర్లకు వచ్చే ఆడియన్స్ లేకపోలేదు. భైరవంతో రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ దాని ఫలితం నెగటివ్ గా రావడంతో ఇప్పుడు ఆశలన్నీ సుందరకాండ మీద పెట్టుకున్నాడు . ఆగస్ట్ 27 విడుదల కాబోతున్న ఈ ఎంటర్ టైనర్ లో ప్రభాస్ మొదటి హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ కథానాయికగా నటించింది. పెళ్లి కానీ ప్రసాద్ తరహా క్యారెక్టర్ ని పోషించిన నారా రోహిత్ ఈసారి పూర్తి వినోదాన్ని పంచుతాడని టీమ్ నమ్మకంగా చెబుతోంది. ఇక ఛాన్స్ విషయానికి వద్దాం.

ఈ వారంలో చెప్పుకోదగ్గ కొత్త రిలీజులు ఎక్కువగా లేవు. రవితేజ మాస్ జాతర తప్పుకోవడంతో గ్రౌండ్ ఫ్రీ అయ్యింది. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో రూపొందిన అర్జున్ చక్రవర్తి, త్రిబాణధారి బార్బరిక్, కన్యాకుమారి ఉన్నప్పటికీ నోటెడ్ ఆర్టిస్టులు ఉన్న మూవీగా అంతో ఇంతో బజ్ వచ్చే అవకాశం ఉన్నది సుందరకాండకు ఒకటే. మిగిలినవి పూర్తిగా టాక్ మీద ఆధారపడినవి. నారా రోహిత్ కనక ఆడియన్స్ నుంచి సానుకూల స్పందన తెచ్చుకుంటే సెప్టెంబర్ 4 దాకా డీసెంట్ వసూళ్లతో బండి లాగించొచ్చు. అటుపై అనుష్క ఘాటీ, మౌళి లిటిల్ హార్ట్స్, శివ కార్తికేయన్ మదరాసి ఉంటాయి కాబట్టి రన్ కొనసాగించడం కష్టం.

వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయమవుతున్న సుందరకాండకు లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చారు. బాక్సాఫీస్ వద్ద ఇంత స్పేస్ దొరకడం నారా రోహిత్ కు కలిసి వచ్చే అంశం. కాకపోతే దాన్ని వాడుకోవడం కీలకం. గత రెండు నెలలుగా థియేటర్లను ఊపేసిన సినిమాలు రాలేదు. హరిహర వీరమల్లు, వార్ 2, కూలీ అంచనాలను నీరుగార్చేశాయి. మహావతార్ నరసింహ లేకపోతే పరిస్థితి ఇంకా దీనంగా ఉండేది. సుందరకాండ ఏదో అద్భుతం చేయకపోయినా పర్వాలేదు కానీ బాగానే ఉందని మాట తెప్పించుకున్నా చాలు దానికి జరిగిన థియేట్రికల్ బిజినెస్ కి ఈజీగా రికవర్ అయిపోతుంది.

This post was last modified on August 23, 2025 6:20 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

15 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago