బాలీవుడ్లో ఒకప్పుడు టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఉన్నాడు మాధుర్ బండార్కర్. చాందిని బార్, కార్పొరేట్, ట్రాఫిక్ సిగ్నల్, ఫ్యాషన్ లాంటి సినిమాలతో అతను గొప్ప పేరే సంపాదించాడు. ఈ మూడు చిత్రాలకూ జాతీయ అవార్డులు రావడం విశేషం. సామాజిక సమస్యలు, మహిళలకు సంబంధించిన స్ఫూర్తిదాయ ఇతివృత్తాలతో సినిమాలు తీయడం మాధుర్ శైలి.
ఐతే ఒకప్పుడు ఆయన సినిమాలకు ప్రశంసలతో పాటు వసూళ్లూ ఉండేవి. కానీ గత కొన్నేళ్లలో మాధుర్ సినిమాలేవీ సరిగా ఆడలేదు. అయినా సరే మాధుర్ ప్రయత్నాలు ఆపలేదు. సినిమాలు తీస్తూనే ఉన్నాడు. కొత్తగా ‘బాలీవుడ్ వైవ్స్’ పేరుతో ఓ సినిమా తీయాలని మాధుర్ అనుకున్నాడు. ఆ టైటిల్‌ను రిజిస్టర్ చేయించాడు కూడా. స్క్రిప్టు కూడా రెడీ అయింది. కానీ మాధుర్‌ను మోసం చేసి ఆ టైటిల్‌ను మరో రకంగా వాడేశాడని అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
కరణ్ తనను మోసం చేశాడంటూ మాధుర్ గోడు వెల్లబోసుకుంటున్నాడు. కరణ్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆయనో పోస్టు కూడా పెట్టాడు. అపూర్వ మెహతాతో కలిసి కరణ్ జోహార్ నెట్ ఫ్లిక్స్ కోసం నిర్మించిన ‘ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ టైటిల్ తన దగ్గర కాపీ కొట్టిందే అని మాధుర్ ఆరోపిస్తున్నాడు.
తాను ‘బాలీవుడ్ వైవ్స్’ టైటిల్‌ను రిజిస్టర్ చేయించుకున్న సంగతి తెలిసి.. ఆ టైటిల్ తమకివ్వాలని కరణ్ అడిగాడని.. కానీ తాను ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించానని.. ఆ టైటిల్‌తోనే సినిమా తీయడానికి సన్నాహాలు చేసుకుంటుండగా.. తన టైటిల్‌ను కొంచెం మార్చి అనైతికంగా ‘ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ అనే టైటిల్‌తో వెబ్ సిరీస్ తీసేసి ట్రైలర్ కూడా రిలీజ్ చేసేశారని మాధుర్ ఆరోపించాడు. తన ప్రాజెక్టును తక్కువగా చూడొద్దని, దయచేసి వెబ్ సిరీస్ టైటిల్ మార్చాలని మాధుర్ కరణ్‌ను కోరాడు. దీనికి అతనెలా స్పందిస్తాడో చూడాలి.
This post was last modified on November 22, 2020 9:37 am
కోలీవుడ్ హీరో సూర్య కొండంత ఆశలతో రెండేళ్లకు పైగా విలువైన సమయాన్ని కేటాయించి చేసిన ప్యాన్ ఇండియా మూవీ కంగువ…
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఎక్కువగా విలన్ వేషాలతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం. కానీ కరోనా టైంలో తనలోని హ్యూమన్…
గత ఏడాది పలుమార్లు వాయిదాపడి ఈ సంవత్సరం ఫిబ్రవరి 7 విడుదల తేదీ లాక్ చేసుకున్న తండేల్ ఒకవేళ సంక్రాంతికి…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ బాలుడు శ్రీ తేజ్ ను టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పరామర్శించారు.…
ఇటీవల టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ.. ఓ వివాదంలో చిక్కుకున్నాడు. వివిధ ఇండస్ట్రీలకు చెందిన నిర్మాతలు, నటీనటులతో నిర్వహించిన…
గేమ్ చేంజర్ సినిమా విడుదలకు ఇంకో నాలుగు రోజులే సమయం ఉండగా.. టీం మీద పెద్ద బాంబు వేయాలని చూసింది…