టాలీవుడ్లో ఒక సీజన్‌కు సంబంధించి చాలా ముందుగా బెర్తులు బుక్ అయ్యేది సంక్రాంతి విషయంలోనే. కనీసం ఆరు నెలల ముందే ఆ సీజన్‌కు సినిమాలను ప్రకటిస్తుంటారు. అందులో కొన్ని చివరి వరకు రేసులో ఉంటాయి. కొన్ని తప్పుకుంటాయి. మధ్యలో కొత్తగా వేరే సినిమాలు పోటీలోకి వస్తాయి. ఐతే కనీసం మూడు నెలల ముందు బెర్తులు లాక్ అయిపోవడం మాత్రం ఖాయం.
వచ్చే సంక్రాంతి విషయంలో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. ఐతే ప్రస్తుతానికి ఒక క్లారిటీ వచ్చేసినట్లే అని భావిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికలో రానున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ముందు నుంచి సంక్రాంతి రేసులోనే ఉంది. ఐతే మధ్యలో ‘విశ్వంభర’ను సంక్రాంతికి తీసుకొచ్చి దీన్ని వేసవికి వాయిదా వేస్తారనే ప్రచారం జరిగింది కానీ.. ఆ చిత్రమే వేసవికి వెళ్లిపోవడంతో అనిల్ సినిమాకు రూట్ క్లియర్ అయింది.
ఇక నవీన్ పొలిశెట్టి చిత్రం ‘అనగనగా ఒక రాజు’ కంటెంట్ మీద నమ్మకంతో చిన్న సినిమా అయినప్పటికీ సంక్రాంతికి ఫిక్స్ అయింది. దాని విషయంలో కూడా ఏ సందేహాలూ లేవు. ఇక సంక్రాంతి రేసులోకి వస్తుందని ఇటీవల ప్రచారంలోకి వచ్చిన చిత్రం.. రాజాసాబ్. ప్రస్తుతానికి ఆ చిత్రానికి అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే.. డిసెంబరు 5. కానీ ఇప్పుడు సంక్రాంతి వైపే టెంప్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. అఫిషియల్ క్లారిటీ కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.
చిరు సినిమాకు, ప్రభాస్ చిత్రానికి 2-3 రోజులు గ్యాప్ ఉండేలా చూసుకుని సంక్రాంతికే ఆ సినిమాను రిలీజ్ చేద్దామని సీరియస్‌గా ఆలోచిస్తున్నారట. ‘రాజా సాబ్’ అలా ఫిక్సయ్యాకే ‘అఖండ-2’ చిత్రాన్ని డిసెంబరు 5కు షిఫ్ట్ చేశారన్నది తాజా సమాచారం. రవితేజ-కిషోర్ తిరుమల కొత్త చిత్రాన్ని కూడా సంక్రాంతికి అనుకున్నారు కానీ.. అది సాధ్యం కాదని ఇండస్ట్రీ వర్గాల టాక్. తమిళం నుంచి విజయ్ చిత్రం ‘జననాయగణ్’ సంక్రాంతి రేసులో నిలుస్తోంది. అది విజయ్ చివరి చిత్రం కావడంతో తెలుగులోనూ పెద్ద స్థాయిలో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. వచ్చే సంక్రాంతికి దాదాపుగా ఈ లైనప్ ఫిక్స్ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
This post was last modified on August 24, 2025 5:22 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…