Movie News

OG ఎక్కడి దాకా వచ్చాడు

పవన్ కళ్యాణ్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా అభిమానులు ఎదురు చూస్తున్న ఓజి విడుదలకు ఇంకో 32 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడ్ పెంచమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మాములుగా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే డివివి ఎంటర్ టైన్మెంట్స్ హ్యాండిల్ హఠాత్తుగా సైలెంట్ అయిపోవడం వాళ్ళను టెన్షన్ కు గురి చేస్తోంది. ప్రస్తుతానికి రిలీజ్ ప్లానింగ్ లో ఎలాంటి మార్పు లేదు. సెప్టెంబర్ 25కి అనుగుణంగానే పనులు జరుగుతున్నాయి. వినాయకచవితి పండగ సందర్భంగా ఆగస్ట్ 27 రెండో ఆడియో సింగల్ రానుంది. తమన్ కంపోజ్ చేసిన మెలోడీని మ్యూజిక్ లవర్స్ కి కానుకగా ఇవ్వబోతున్నారు.

అసలైన ఛాలెంజింగ్ టాస్క్ ఇక ముందుంది. అసలే భారీ అంచనాలు నెలకొన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతున్నాయి. వార్ 2, కూలీ ఇచ్చిన షాకులు మామూలువి కాదు. ఒకటి బ్రేక్ ఈవెన్ అందుకోవడానికే అష్టకష్టాలు పడితే మరొకటి నష్టాలను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద మళ్ళీ జోష్ తేవాల్సిన బాధ్యత ఓజి మీద ఉంది. అసలే హరిహర వీరమల్లు తాలూకు ఫ్రస్ట్రేషన్ ఫ్యాన్స్ లో పచ్చిగానే ఉంది. దాన్ని తొలగించాలి. తీసింది రెండు సినిమాలే అయినా దర్శకుడు సుజిత్ మీద రాజమౌళి రేంజ్ లో ఆశలు పెట్టుకున్నారు. గతంలో తనిచ్చిన హైప్ కూడా అదే స్థాయిలో ఉంది.

ఇక అందరి కళ్ళు ట్రైలర్ మీద ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు విడుదలకు వారం ముందు మాత్రమే ట్రైలర్ లాంచ్ ఉండొచ్చని అంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా చాలా బిజీగా ఉన్నారు. డబ్బింగ్ కి టైం దొరకడమే ఎక్కువనేలా ఉంది పరిస్థితి. వీరమల్లుకు ఇచ్చినంత సమయం దీనికి కేటాయించడం అనుమానంగానే ఉంది. అయినా సరే హైప్ కొచ్చిన ఇబ్బందేమీ లేదు. కంటెంట్ బాగుండి అంచనాలు అందుకుంటే మాత్రం ఓజి రికార్డులకు ఆకాశమే హద్దుగా మారనుంది. చూడాలి ఏం చేస్తారో.

This post was last modified on August 23, 2025 1:27 pm

Share

Recent Posts

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

4 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

7 hours ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

7 hours ago

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

8 hours ago

అగ్గిపెట్టి మ‌చ్చా ఇక లేడు

అగ్గిపెట్టి మ‌చ్చా.. సోష‌ల్ మీడియా వాడే తెలుగు వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి…

9 hours ago

ఇకపై మొహమాటలు లేవంటున్న నాని

న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…

9 hours ago