మామూలుగా కంగనా రనౌత్‌తో పెట్టుకోవడానికి బాలీవుడ్ బిగ్ షాట్లే చాలా భయపడుతుంటారు. ఐతే ఆమెతో కయ్యానికి సై అంటున్నాడు మన వివాదాల వీరుడు రామ్ గోపాల్ వర్మ. ఐతే ఈ కయ్యం ఏదైనా ఇష్యూ మీదేమో అనుకోకండి. వర్మ సై అంటున్నది బాక్సాఫీస్ వార్‌కు. కంగనా జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’లో లీడ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. థియేటర్లు పూర్తి స్థాయిలో ఎప్పుడు నడిస్తే అప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఫిబ్రవరిలో రిలీజ్ ఉండొచ్చని భావిస్తున్నారు.
ఆ సినిమాకు పోటీగా తన ‘శశికళ’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వర్మ ప్రకటించాడు. జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళ జీవితం ఆధారంగా వర్మ ఎప్పుడో సినిమా ప్రకటించాడు. మధ్యలో దాన్ని పట్టించుకోకుండా వదిలేశాడు.
కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఆ సినిమా మేకింగ్ గురించి అప్ డేట్ ఇచ్చాడు. ఇంతకుముందు వర్మతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీసిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు రాకేష్ రెడ్డే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే పూర్తవుతుందని.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు, సరిగ్గా కంగనా సినిమా ‘తలైవి’ విడుదలయ్యే రోజే ‘శశికళ’ను రిలీజ్ చేస్తామని వర్మ ప్రకటించాడు.
‘తలైవి’లో జయలలిత మాత్రమే ఉంటుందని.. శశికళ పాత్రకు చోటుండదని.. కానీ తన సినిమాలో శశికళతో పాటు జయలలితకూ చోటుంటుందని.. అలాగే పన్నీర్ సెల్వం, పళని స్వామిల పాత్రలూ ఇందులో ఉంటాయని.. కాబట్టి తన సినిమానే ఎగ్జైటింగ్‌గా ఉంటుందని వర్మ పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. ‘తలైవి’ టీంను గిల్లుతూ కొన్ని ట్వీట్లు వేసి ‘శశికళ’ సినిమా గురించి అప్ డేట్స్ ఇచ్చాడు. ఐతే వర్మ సినిమా అంటే జనాలు మరీ లైట్ తీసుకుంటున్న ఈ రోజుల్లో ‘తలైవి’ టీం పెద్దగా కంగారు పడాల్సిన అవసరమైతే ఉండదేమో.
This post was last modified on November 22, 2020 9:24 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…