Movie News

స్ట్రైక్ ఆగేలా చేసిన ఒప్పందమేంటి?

టాలీవుడ్‌న గత మూడు వారాలుగా కార్మికుల సమ్మె కుదిపేసింది. జీతాల పెంపు కోసం ఫిలిం ఫెడరేషన్ ఇన్ని రోజుల పాటు స్ట్రైక్ చేయడం ఇండస్ట్రీకి పెద్ద షాక్. దీంతో షూటింగ్స్ అన్నీ ఆగిపోయి నిర్మాతలకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తప్పలేదు. మధ్యలో చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లే కనిపించాయి. కానీ మళ్లీ ప్రతిష్టంభన తప్పలేదు. ఐతే ఎట్టకేలకు సమ్మె ఆగింది. చిత్రీకరణలు శుక్రవారం నుంచే పున:ప్రారంభం అవుతున్నాయి. మరి సమ్మె ఆగేలా చేయడానికి కుదిరిన రాజీ ఒప్పందం ఏంటి అన్నది ఆసక్తికరం.

ఇంతకుముందు నిర్మాతలు ప్రతిపాదించిన జీతాల పెంపుకి అంగీకరించని కార్మికులు.. స్వల్ప మార్పులతో ఇప్పుడు సరే అన్నారు. రాజీ ఒప్పందం ప్రకారం జీతాల పెంపు ఎలా ఉండబోతోందంటే.. తమకు 30 శాతం మేర జీతాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేయగా.. అలా కాకుండా 22.5 శాతం, అది కూడా దశల వారీగా జీతాలు పెంచేలా ఒప్పందం కుదిరింది.

రోజుకు రూ.2 వేల లోపు జీతాలు ఉన్న వారికి తొలి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంపు ఉండబోతోంది. రోజుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల ఆదాయం ఉన్న వారికి తొలి ఏడాది 7.5 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం జీతాలు పెంచనున్నారు. సమ్మె ఆరంభమైన తొలి వారంలోనే నిర్మాతలు ఇలా దశల వారీగా జీతాల పెంచేందుకు ఒక ప్రతిపాదన చేశారు. కానీ అందుకు కార్మికులు అంగీకరించలేదు. అందరికీ ఏకమొత్తంగా వాళ్లు ప్రతిపాదించిన దాని కంటే ఎక్కువ జీతాలు కావాలని కోరారు. ఐతే తాజాగా మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకోవడం.. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి రావడంతో రాజీ ఒప్పందం కుదిరింది.

This post was last modified on August 22, 2025 11:57 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago