చిన్న టైటిల్ గ్లిమ్ప్స్ అయినప్పటికీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ రివీల్ కోసం అభిమానులు నిన్నటి నుంచే ఎదురు చూడటం మొదలుపెట్టారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆ లాంఛనాన్ని ఇవాళ గ్రాండ్ గా హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ పీసీఎక్స్ స్క్రీన్ లో జరిపారు. టీజర్ కాదు కాబట్టి కేవలం మెగాస్టార్ స్టైల్ అండ్ స్వాగ్ ని చూపిస్తూ వెంకటేష్ వాయిస్ ఓవర్ లో పేరుని రివీల్ చేయడంతో ఒక పెద్ద సస్పెన్స్ కి తెరవీడింది. సూటు బూటులో దర్జాగా సిగరెట్ కాలుస్తూ నడుచుకుంటూ వస్తుంటే చిరు ఫ్యాన్స్ పాత రోజుల్లోకి వెళ్లిపోయారు. చివర్లో గుర్రంతో పాటు వెళ్తున్న షాట్ తో స్పెషల్ బోనస్ గా ముగించారు.
విజువల్స్ చూస్తే చిరంజీవిని ఏదో సిబిఐ రేంజ్ ఆఫీసర్ గా నటిస్తున్నారనే క్లారిటీ వచ్చేసింది. మరి డ్రిల్ మాస్టర్ గా ఇంతకు ముందు తీసిన షెడ్యూల్ లో చూపించిన పాత్ర ఏమిటనేది ప్రస్తుతానికి భేతాళ ప్రశ్నే. క్వాలిటీ చూస్తుంటే అనిల్ రావిపూడి మార్క్ తో పాటు మెగా స్వాగ్ స్పష్టంగా కనిపిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తరహాలోనే పూర్తి ఎంటర్ టైన్మెంట్ తో తీస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ లో అడుగు పెట్టలేదు కాబట్టి ప్రస్తుతానికి లీక్స్ రాలేదు కానీ డిసెంబర్ లో ఆయన పుట్టినరోజుకి స్పెషల్ టీజర్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.
2026 సంక్రాంతికి వస్తున్న మన శంకరవరప్రసాద్ గారుకి కావాల్సిన ప్రాధమిక హైప్ అనిల్ రావిపూడి ఇచ్చేశాడు. ఎప్పటి నుంచో బాస్ ని ఇలా చూడాలనుకుంటున్న అభిమానుల అంచనాలకు తగ్గట్టే నడుచుకుంటాననే హామీ ఇందులో దొరికింది. మరో ప్రత్యేకత ఏమిటంటే భీమ్స్ సిసిరోలియో స్వంత బీజీఎమ్ కాకుండా 1991 రౌడీ అల్లుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని రీమిక్స్ రూపంలో వాడుకోవడంతో నోస్టాల్జియా ఫీలింగ్ పెరిగింది. చాలా కాలం తర్వాత చిరంజీవి ఒక సాఫ్ట్ టైటిల్ తో సినిమా చేయడం మన శంకరవరప్రసాద్ తోనే కుదిరింది. ఇంకో నాలుగున్నర నెలల్లో వచ్చేస్తారు కాబట్టి అక్టోబర్ నుంచి పబ్లిసిటీ పీక్స్ లో ఉండనుంది.
This post was last modified on August 22, 2025 12:02 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…