నలభై ఏడు సంవత్సరాల క్రితం కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే కుర్రాడు చిరంజీవి పేరుతో ప్రాణం ఖరీదు సినిమాతో తెరంగేట్రం చేసినప్పుడు టాలీవుడ్ ఊహించి ఉండదు. తన నడకను పరుగుగా మార్చే ఒక జెట్ స్పీడ్ రాకెట్ భవిష్యత్తుని శాసించబోతుందని. ఎన్టీఆర్ లాంటి దిగ్గజం తెరవేల్పుగా పూజింపబడుతూ రాజకీయాల్లోకి వెళ్తున్న సమయంలో ఆయన వదిలేసుకున్న నెంబర్ వన్ స్థానాన్ని అందుకోవడానికి ఒక సునామి పుట్టుకొచ్చిందని కళామతల్లి ముందే ఊహించిందో లేదో. చినుకులుగా మొదలై, మన ఊరి పాండవులతో వర్షంగా మారిన ఆ సునామి నాలుగు దశాబ్దాలకు పైగా ప్రేక్షకుల హృదయాల్లో చెక్కు చెదరని ముద్ర వేయడం ఒక చరిత్ర.
ఆడియన్స్ అభిరుచులు, అంచనాలు మార్పులకు లోనవుతున్న 80 దశకంలో చిరంజీవి తీసుకొచ్చిన సినీ విప్లవం సామాన్యమైంది కాదు. 1983 ఖైదీలో నిలువెల్లా ఆవేశం నిండి అన్యాయం మీద పోరాడే సూర్యం పాత్రలో సుప్రీమ్ హీరోని చూసి యువతకు గూస్ బంప్స్ అంటే ఏంటో తెలిసొచ్చింది. 1988 పసివాడి ప్రాణంలో బ్రేక్ డాన్స్ పేరుతో ఒళ్ళంతా వయ్యారంగా తిప్పుతూ పక్కన అందమైన హీరోయిన్ ఉన్న విషయాన్ని జనం మర్చిపోయేలా చేయడం ఆయనకు మాత్రమే తెలిసిన బ్రహ్మ విద్య. గూండాలో కదులుతున్న ట్రైన్ కింద వేలాడుతూ రిస్క్ చేసినా, యమకింకరుడులో ప్రాణాలను రిస్కులో పెట్టి స్టంట్స్ చేసినా అవన్నీ అభిమాన గణాన్ని మెప్పించడం కోసమే.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్న 1990లో మోకాలి లోతు నీటిలో తడుస్తూ జనం థియేటర్లకు రావడం జగదేకవీరుడు అతిలోకసుందరి అనే అద్భుతం చేసిన మాయాజాలం. తెలుగు సీమకు మొదటి పది కోట్ల గ్రాసర్ అందించిన ఘరానా మొగుడు ఆడిన థియేటర్ల గోడలను అడిగితే చెబుతాయి అవి ఎంతటి విధ్వంసాన్ని కళ్లారా చూశాయో. మాస్ నే కాదు కోట్లాది కుటుంబాలను సైతం గంపగుత్తగా తన వైపుకు లాగే ఆకర్షణ శక్తిని గ్యాంగ్ లీడర్ గా పిలిచేవారు. రౌడీ అల్లుడు చేసిన అల్లరికి పెద్దవాళ్ళే చిన్నపిల్లలా కేరింతలు కొట్టారు. ఆపద్బాంధవుడులో మాధవుడు చూపించిన భావోద్వేగాలకు కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఎంత శిఖరమైనా భూకంపం వచ్చినప్పుడు ఒడిదుడుకులు తప్పవు. చిరంజీవికి ఫెయిల్యూర్స్ అలాంటి పరీక్షే పెట్టాయి. వరస ఫ్లాపులు వచ్చినప్పుడు పనైపోయిందని అన్నారు. ఏడాది గ్యాప్ తీసుకుని ఐదుగురు చెల్లెళ్ళకు అన్నయ్యగా చూపించిన హిట్లర్ విశ్వరూపానికి టికెట్ కౌంటర్లలో లక్ష్మిదేవి తిష్టవేసుకుని కూర్చుకుంది. స్నేహం కోసంలో సింహాద్రి క్యారెక్టర్ లో మెగా నటనకు కళ్ళు చెమ్మగిల్లని వాళ్ళు ఉండరేమో. మళ్ళీ ఆటుపోట్లు ఎదురైనా, డిజాస్టర్లు పలకరించినా, మనోనిబ్బరంతో తట్టుకుని ఇంద్రతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన హిస్టరీని అభిమానులు ఎన్నిసార్లు తలుచుకుంటారో లెక్క చెప్పడం కష్టం. ఆ వైబ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.
సమాజ సేవ చేయాలనే ఆశయంతో ప్రజారాజ్యం పార్టీ స్థాపన, రాజకీయ వైఫల్యం తెరపై మెగాస్టార్ కు, ప్రేక్షకులకు ఏడు సంవత్సరాల గ్యాప్ తీసుకొచ్చినా అవేవీ ఆయన మీద తెలుగు ప్రజల అభిమానాన్ని తగ్గించలేకపోయాయి. ఖైదీ నెంబర్ 150తో పునఃస్వాగతం ఘనంగా పలికారు. సైరా నరసింహారెడ్డిలో ఉగ్ర రూపానికి పరవశులయ్యారు. వాల్తేరు వీరయ్యలో వింటేజ్ మాస్ ని ఎంజాయ్ చేశారు. ఇప్పుడు విశ్వంభర కోసం ఎదురు చూస్తున్నారు. మన శంకర వరప్రసార్ గారుకి వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ఏడు పదుల వయసులో ముప్పై ఏళ్ళ కుర్రాడిగా చిరు చూపిస్తున్న చలాకీతనం ఏ డాక్టర్ అనుభవానికి అందని నిత్య యవ్వనపు సంజీవని సూత్రం.
This post was last modified on August 22, 2025 10:22 am
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…