విడుదల ముందు వరకు కూలీ మీద కోలీవుడ్ లవర్స్ పెట్టుకున్న ఆశ ఒక్కటే. ఖచ్చితంగా వెయ్యి కోట్ల గ్రాస్ సాధించి ఆ క్లబ్బులోకి సగర్వంగా అడుగు పెడుతుందనే నమ్మకంతో ఎదురు చూశారు. కానీ అది నెరవేరేలా టాక్ రాలేదు. విపరీతమైన అంచనాలు మోయలేక దర్శకుడు లోకేష్ కనగరాజ్ చేతులు ఎత్తేశాడు. తెరనిండా అద్భుతమైన తారాగణం, మంచి నీళ్ళలా ఖర్చు పెట్టిన బడ్జెట్ ఉన్నప్పటికీ వాటిని సరైన రీతిలో సద్వినియోగపరుచుకోలేదు. ఫలితం వారం దాటుతున్నా అయిదు వందల కోట్లను దాటలేకపోయింది. వీకెండ్ లో ఆ లాంఛనం ఈజీగా అయిపోతుంది కానీ అసలు మ్యాటర్ అది కాదు.
బంగారం లాంటి అవకాశాన్ని కూలీ చేతులారా చెడగొట్టుకుంది. మళ్ళీ ఆ ఛాన్స్, ఇంత క్రేజీ కాంబో తమిళంలో ఇప్పట్లో లేదు. విజయ్ జన నాయాగన్ వస్తోంది కానీ దాని దర్శకుడు వినోత్ బ్రాండ్ బిజినెస్ పరంగా పెద్దగా ఉపయోగపడదు. పైగా విజయ్ పొలిటికల్ గా యాక్టివ్ కావడంతో రాజకీయ ఉద్దేశాలను మనసులో పెట్టుకుని సినిమాను వివిధ మార్గాల్లో అణిచి వేయొచ్చనే అనుమానం ఫ్యాన్స్ లో ఉంది. అంటే థియేటర్లను ఎక్కువ ఇవ్వకుండా చేయడం, బెనిఫిట్ షోలకు నో చెప్పడం, పోటీ సినిమాలకు స్క్రీన్లు వచ్చేలా చేయడం లాంటి వాటికి అవకాశం లేకపోలేదు. పైగా విజయ్ ఈ మధ్య అధికార పార్టీని నేరుగా టార్గెట్ చేస్తున్నాడు.
పోనీ జైలర్ 2కి ఆ ఛాన్స్ ఉందనుకుంటే అదెప్పుడో 2026 వేసవిలో వచ్చేలా ఉంది కాబట్టి లాంగ్ వెయిటింగ్ తప్పదు. అజిత్ సీరియస్ గా సినిమాలు చేయడం లేదు. విడాముయార్చి డిజాస్టర్ కాగా గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళంలో మాత్రమే ఓ మోస్తరుగా ఆడింది. ఇక కమల్ హాసన్ నుంచి కొత్త మూవీ రావడానికి చాలా టైం పట్టేలా ఉంది. ఇండియన్ 3 రిలీజైతే గొప్ప. ఇక వందల కోట్ల వసూళ్లు కల్లో మాట. ఇవన్నీ చూసుకుంటే వెయ్యి కోట్ల స్వప్నం చాలా దూరంలో ఉన్నట్టే. కానీ మనకలా కాదు. ఏడాది టైంలోనే రాజా సాబ్, ఎన్టీఆర్ – నీల్, ఓజి, విశ్వంభర, ఫౌజీ వగైరాలలో ఒకటో రెండో ఖచ్చితంగా ఈ ఫీట్ ని సాధించి చూపిస్తాయి.
This post was last modified on August 22, 2025 7:54 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…