సరిగ్గా ఏడాది క్రితం టీజర్ తో విపరీతమైన నెగటివిటీని మూటగట్టుకున్న విశ్వంభర ఏకంగా ఏడాది పాటు సైలెంట్ గా ఉండటం చిరంజీవికి ఎప్పుడూ ఎదురు కాని అనుభవం. విఎఫ్ఎక్స్ మీద ట్రోలింగ్ జరిగే స్థాయిలో కంటెంట్ ఇవ్వడంతో కొంత కాలం పాటు టీమ్ మౌనంగా ఉండిపోయింది. సోషల్ మీడియాలో కామెంట్స్ భరిస్తూ వచ్చింది. మెగాస్టార్ సైతం తప్పెక్కడ జరిగిందో గుర్తించి దానికి అనుగుణంగా మార్పులు చేయమని దర్శకుడు వశిష్ఠకు సూచించడంతో క్వాలిటీ పెరుగుతుందనే నమ్మకం ఫ్యాన్స్ లో కలిగింది. ఇవాళ నిమిషం పాటు ఉండే చిన్న గ్లిమ్ప్స్ ని చిరు పుట్టినరోజు సందర్భంగా వదిలారు.
అసుర లక్షణాలున్న రాక్షసుడు ఒక జాతి వినాశనానికి పూనుకుంటే వాడి సమూహాన్ని ఎదిరించేందుకు వచ్చిన ఒక సాహసికుడు చరిత్రలో నిలిచిపోయేలా ఏం చేశాడనే థీమ్ ని వాయిస్ ఓవర్ తో వినిపించి కొన్ని విజువల్స్ చూపించారు. ఫస్ట్ షాట్లో పెద్ద తేలు మట్టి లో నుంచి బయటికి రావడంతో మొదలుపెట్టి చివరి షాట్ లో ఒక పెద్ద కన్నుని చిరంజీవి తన చేతిలో పట్టుకోవడం దాకా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఈసారి చాలా తెలివిగా ఎఫెక్ట్స్ తక్కువగా అవసరమున్న సీన్లతో మాత్రమే గ్లిమ్ప్స్ ని కట్ చేశారు. మట్టిలో జరిగే ఫైట్ తాలూకు శాంపిల్స్ ని చూపించి ఆఖర్లో మెగాస్టార్ ని రివీల్ చేశారు.
విడుదలకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇంతకంటే ఆశించలేం కానీ తగ్గిపోయిన విశ్వాసాన్ని కొంచెం పెంచడంలో వశిష్ఠ సక్సెస్ అయ్యాడు. కాకపోతే ఇది చాలదు. దీనికన్నా ముందు రిలీజయ్యే మన శంకర వరప్రసాద్ గారు కోసం విశ్వంభరకు కొంత కాలం లో ప్రొఫైల్ మైంటైన్ చేయడం ఖాయం. అంతా బాగానే ఉంది కానీ ఎంఎం కీరవాణి బీజీఎమ్ లో కొంచెం మెరుపు తగ్గిందనిపిస్తుంది. ఫైనల్ స్కోర్ ఇది కాదు కాబట్టి ఇప్పుడే దాని మీద కామెంట్ చేయలేం టెక్నికల్ గా సాలిడ్ కంటెంట్ ఉన్న నమ్మకాన్ని కలిగించిన విశ్వంభరని మళ్ళీ కొత్త అప్డేట్స్ ఫిబ్రవరి నుంచి ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.
This post was last modified on August 21, 2025 6:42 pm
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…