Movie News

నారాయణమూర్తి కోసం సినిమా ఆడాలి

ఈ శుక్రవారం విడుదలవుతున్న సినిమాల్లో కొంచెం బజ్ కనిపిస్తోంది అనుపమ పరమేశ్వరన్ పరదాకు ఒకటే. కంటెంట్ మీద నమ్మకంతో రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేశారు. దీంతో పాటుగా వస్తున్న మూవీ యునివర్సిటి పేపర్ లీక్. గతంలో ఓసారి రిలీజైనా అది వచ్చిన సంగతి ప్రేక్షకులకు తెలిసే లోపే వెళ్లిపోవడంతో హీరో కం దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి మరోసారి థియేటర్లకు తీసుకొస్తున్నారు. ప్రమోషన్లలో అండగా నిలబడేందుకు బ్రహ్మానందం, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి లాంటి టాప్ సెలబ్రిటీలు ముందుకొచ్చి తమకు తోచిన మాట సాయం చేస్తున్నారు.

నిజానికి ప్యాన్ ఇండియా మూవీస్ రాజ్యమేలుతున్న మార్కెట్ లో నారాయణమూర్తి సినిమాలు ఆడటం అంత సులభం కాదు. సామజిక సమస్యలను టికెట్లు కొని చూసేందుకు సాధారణ ఆడియన్స్ సిద్ధంగా లేరు. ఒకప్పుడు ఎర్ర సైన్యం, దండోరా, చీమల దండు లాంటివి ఆడాయంటే దానికి కారణం, అప్పట్లో చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల జనంలో అవగాహన, ఆవేదన రెండూ ఉండటం. కానీ ఇప్పటి మెకానికల్ లైఫ్ లో అది కొరవడింది. పరుగులు పెట్టే యాంత్రిక జీవితంలో కేవలం ఎంటర్ టైన్మెంట్ కోసం తప్ప సినిమాలు చూడటం లేదు. అందులోనూ సీరియస్ గా డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ కి దూరంగా ఉంటున్నారు.

ఇంత ప్రతికూల పరిస్థితుల్లోనూ తన బాట వీడకుండా నారాయణమూర్తి చేసిన ప్రయత్నానికి మద్దతు దక్కితే అంత కన్నా మూవీ లవర్స్ సంతోషించడానికి ఏముంటుంది. ఏడు పదుల వయసులోనూ బ్రహ్మచారిగా ఉన్న పీపుల్స్ స్టార్ ఇప్పటి యువతను మాత్రం తనలా ఉండొద్దని కోరుతున్నారు. పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని, ఇల్లు కట్టుకోమని సూచన చేస్తున్నారు. నిరాడంబర జీవితంలో ఇవన్నీ చేయకుండా తాను చాలా కోల్పోయాయని, తనలా మాత్రం ఉండొద్దని కోరుతున్నారు. ఇంత స్వచ్ఛంగా నిజాయితీగా ఉంటారు కాబట్టే నారాయణమూర్తి సినిమా ఆడాలని ఇండస్ట్రీనే కాదు సగటు పబ్లిక్ కూడా కోరుకుంటోంది.

This post was last modified on August 21, 2025 11:47 am

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

7 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

7 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

7 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

7 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

9 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

9 hours ago