దసరా సినీ సంబరాలకు ఇంకో ఐదు వారాల సమయమే ఉంది. ఈసారి ఆ పండక్కి ఓజీ, అఖండ-2 లాంటి క్రేజీ మూవీస్ షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. దసరాకు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ చేసే స్కోప్ ఉంటుంది కాబట్టి పవన్, బాలయ్యల చిత్రాలు రెండూ విడుదలైనా ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి ఇటు ఓజీ, అటు అఖండ-2 రెండూ కూడా రేసులో ఉన్నట్లే భావించాలి. కానీ ప్రమోషన్లలో ఓజీ ముందంజలో ఉంది. షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి.
ఆల్రెడీ ఒక పాట లాంచ్ చేశారు. రెండో పాటకు కూడా రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయడానికి ఏ రకమైన అడ్డంకులూ కనిపించడం లేదు. ఐతే ‘అఖండ-2’ విషయంలోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా చివరి షెడ్యూల్ కొంచెం ఆలస్యమైంది. కొన్ని సీన్లు, పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఎప్పుడు గుమ్మడికాయ కొట్టేదీ క్లారిటీ లేదు. ఇంకా రిలీజ్‌కు ఐదు వారాల సమయం ఉంది కాబట్టి సినిమా దసరాకే వస్తుందిలే అనుకోవచ్చు.
కానీ బాలయ్య గత చిత్రాలతో ‘అఖండ’ను పోల్చలేం. బాలయ్యకు పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ తెచ్చిపెట్టే అవకాశం ఉన్న సినిమా ఇది.
‘అఖండ’ ఓటీటీలో వచ్చినపుడు హిందీ జనాలు కూడా ఎగబడి చూశారు. అందులోని డివైన్ ఎలిమెంట్ వాళ్లకు తెగ నచ్చేసింది. ‘అఖండ-2’ను హిందీలోనూ బాగా ప్రమోట్ చేసి, పెద్ద స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. టీజర్ లాంచ్ అయినపుడు నార్త్ ఇండియాలో బాగా ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేశారు. రిలీజ్ ముంగిట ఇంకా గట్టిగా ప్రమోషన్ చేయాలనుకుంటున్నారు. దాంతో పాటు హిందీ డబ్బింగ్ కూడా శ్రద్ధగా చేయాల్సి ఉంది.
తమిళం, మలయాళంలోనూ ఒకేసారి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇన్ని భాషల్లో డబ్బింగ్, ప్రమోషన్ అంటే టైం పడుతుంది. ఈపాటికి షూటింగ్ అయిపోయి ఉంటే.. ప్లానింగ్ కరెక్ట్‌గా ఉండేది. కానీ షూట్ ఆలస్యం కావడం వల్ల పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్‌కు సమయం సరిపోతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కాబట్టి దసరాకు పక్కాగా సినిమాను రిలీజ్ చేస్తారా అని చెప్పలేం. కొంచెం టైం తీసుకుని సోలోగా సినిమాను రిలీజ్ చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేం.
This post was last modified on August 20, 2025 6:23 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…