ఒక వారం మధ్యలో ఏదైనా పెద్ద పండుగ లేదా సెలవు రోజు పడితే ఎక్స్‌టెండెడ్ వీకెండ్‌తో సినిమాలకు బాాగా ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇండిపెండెన్స్ డే వీకెండ్ ఇలాగే కూలీ, వార్-2 చిత్రాలకు ప్లస్ అయింది. గురువారం ఈ సినిమాలు రిలీజయ్యాయి. శుక్ర, శని, ఆదివారాలు సెలవు కావడంతో కలిసొచ్చింది. రెండు చిత్రాలకూ టాక్‌తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దీని తర్వాత సినిమాలకు అలా ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది వినాయక చవితి వీకెండ్.
ఈ నెల 27న, బుధవారం వినాయక చవితి సెలవు. ఆ రోజున సినిమా రిలీజ్ చేస్తే ఐదు రోజుల పాటు సినిమాలకు మంచి వసూళ్లు వచ్చే అవకాశముంది. కానీ ఈ వీకెండ్‌ను టాలీవుడ్ ఉపయోగించుకునేలా కనిపించడం లేదు. చవితి రోజు రావాల్సిన మాస్ రాజా రవితేజ సినిమా ‘మాస్ జాతర’ వాయిదా పడిపోవడం థియేటర్లకు పెద్ద షాక్. కూలీ, వార్-2 చిత్రాలు ఆ సమయానికి స్లో అయిపోతాయి కాబట్టి.. చవితి రోజు క్రేజ్ ఉన్న సినిమా వస్తే మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చు.
కానీ వారం ముందు వరకు 27కు పక్కా అనుకున్న ‘మాస్ జాతర’ ఇప్పుడు వాయిదా పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబరు 12న కొత్త డేట్ అంటున్నారు. కారణాలేవైనా కానీ.. ‘మాస్ జాతర’ను వాయిదా వేయడం ద్వారా గోల్డెన్ ఛాన్స్ మిస్సయినట్లే. సెప్టెంబరులో రాబోతున్న ఘాటి, మిరాయ్ చిత్రాల్లో ఏదైనా ఒకటి వినాయక చవితి వీకెండ్లో వచ్చినా వాటికి ప్లస్ అయ్యేది.
ప్రస్తుతానికి సుందరకాండ, త్రిబాణధారి బార్బరిక్ లాంటి చిన్న సినిమాలే చవితి వీకెండ్లో రాబోతున్నాయి. వాటికి పెద్దగా బజ్ లేదు. టాక్ బాగుంటే వాటికి ఆ వీకెండ్ పెద్ద అడ్వాంటేజీ ఉన్నట్లే.
This post was last modified on August 20, 2025 2:46 pm
సినిమాలకు సంబంధించి క్రేజీ సీజన్లకు చాలా ముందుగానే బెర్తులు బుక్ చేసేస్తుంటారు. తెలుగులో ఏడాది ఆరంభంలో సంక్రాంతి సీజన్‌కు బాగా…
ఏపీలోని కూటమి ప్రభుత్వంలోనే కాదు.. పార్టీల్లోనూ ప్రక్షాళన జరగనుందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీల పరంగా పైస్థాయిలో నాయకులు…
రాజకీయ రంగ ప్రవేశానికి ముందు విజయ్ చివరి సినిమాగా చెప్పుకున్న జన నాయకుడు జనవరి 9 విడుదల కానుంది. మలేసియాలో…
సోమవారం వచ్చేసింది. ఎంత పెద్ద సినిమా అయినా వీక్ డేస్ మొదలుకాగానే థియేటర్ ఆక్యుపెన్సీలో తగ్గుదల ఉంటుంది. కాకపోతే అది…
మన శంకరవరప్రసాద్ గారులో వెంకటేష్ క్యామియో గురించి ఎన్ని అంచనాలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. పేరుకి గెస్టు రోల్ అంటున్నా ఇరవై…
మూడున్నర గంటలకు పైగా నిడివి అంటే ప్రేక్షకులు భరించగలరా? రణ్వీర్ సింగ్ మీద ఒక సినిమా అనుభవమున్న దర్శకుడు స్వీయ…